News

ఘనంగా ముగిసిన IARI వ్యవస్థాపక దినోత్సవం

KJ Staff
KJ Staff

భారత వ్యవసాయ పరిశోధన సంస్థ(IARI) దాని 117 వ్యవస్థాపక దినోత్సవాని ఏప్రిల్ 1న ఘనంగా నిర్వహించింది. ఢిల్లీ లోని బీపీ పాల్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా IARI డైరెక్టర్ డా. ఏ.కే. సింగ్, మాట్లాడుతూ, గత 117 సంవత్సరాలుగా IARI భారత వ్యవసాయరంలో తీసుకువచ్చిన అనేక మార్పులని కొనియాడారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి IARI చేసిన సేవలను స్మరించుకున్నారు.

భారత వ్యవసాయ పరిశోధన సంస్థ 1905 లో మొదటి సరి బీహార్లోని పూస ప్రాంతంలో నిర్మానించారు.కానీ పూసాలో సంభవించిన భూకంపానికి IARI ద్వాంసం అయ్యింది అందుకుగాను, 1934 తర్వాత న్యూ ఢిల్లీ తిరిగి ఈ సంస్థను పునఃప్రారంభించారు. భారతీయులు ప్రధాన ఆహారంగా స్వీకరించే, వరి మరియు గోధుమ పంట రకాల్లో కీలక మార్పులు తీసుకువచ్చారు. బాస్మతి బియ్యం, అధిక ధిబడిని ఇచ్చే గోధుమ, కలుపు మందులకు నిరోధకత కలిగిన పంట రకాలను అభివృద్ధి చేసారు. నిన్న బీపీ పాల్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో, వ్యవసాయ శాస్త్రజ్ఞుల నియామక సంస్థ చైర్మన్, డా. సంజయ్ కుమార్ ఉపన్యాసం ద్వారా మొదలైయింది. అనంతరం IARI డైరెక్టర్ డా. ఏ.కే. సింగ్ మాట్లాడుతూ 2023-24 సంవత్సరం IARI విడుదల చేసిన కొత్త రకాల గురించి మాట్లాడారు. గత ఏడాది మొత్తం 25 కొత్త గోధుమ రకాలను, 42 రకాల పండ్లు, పూలు, కూరగాయల రకాలను విడుదల చేసినట్లు తెలిపారు. మరియు అధిక ఎగుమతి విలువ కలిగిన బాస్మతి రకం బియ్యంలో కొత్త రకాల ద్వారా ఉత్పాదకతను పెంచామని, తద్వారా 50 బిలియన్ డాలర్ల విలువగల ఎగుమతులు జరిపినట్లు తెలిపారు.

అంతే కాకుండా పంజాబ్, హర్యానా ప్రాంతాల్లో పెరిగేందుకు అనువుగా ఉన్న వరి రకాలను అభివృద్ధి చేసి వాటిని విడుదల చేసినట్లు ప్రస్తావించారు. కేవలం 120 రోజుల్లోనే పరిప్కావం చెందే Pusa 2090, Pusa1824 రకాలను అభివృద్ధి చేశామని కనుక ఈ ప్రాంతంలోని రైతులు తక్కువ కాలంలోనే పంటను పొందుతున్నారు. అదే విధంగా బాస్మతి బియ్యంలో విడుదల చేసిన పూస-1509, 1847, 1692 రకాల గురించి ప్రస్తావించారు. పంటలో వచ్చే కలుపు మొక్కలను నివారించే కలుపు మందుల ప్రభావాన్ని తట్టుకొని నిలబడగలిగే రకాలను IARI అభివృద్ధి చేసింది. ఉత్తర దేశంలో గోధుమ పంటను ప్రధానంగా సాగుచేస్తారు. IARI అభివృద్ధి చేసిన గోధుమ రకాలను సుమారు 10 లక్షల హెక్టర్లలో సాగుచేయడం గర్వించదగ్గ విషయమని ఏ.కే. సింగ్ సంతోషం వ్యక్తం చేసారు.

శిలాజ ఇంధనాల వినియోగం ద్వారా జరుగుతున్న వాతావరణ నష్టాన్ని సమగ్రంగా ఎదురుకునేందుకు భారత ప్రభుత్వం 2025 నాటికీ శిలాజ ఇంధనాల్లో 20% జీవ ఇంధనాతో కలిపి వినియోగించేందుకు యోచిస్తోంది. ఈ ఆలోచనకు అనువుగా జీవ ఇందలను ఉత్పత్తి చేసే హైబ్రిడ్ మొక్కలను అభివృద్ధి చేస్తున్నారు. తర్వాత డా. సుధీర్ కే. సపూరి మాట్లాడుతూ, డా. సంజయ్ కుమార్ భారత వ్యవసాయ అభివృద్ధికి చేసిన కృషిని కొనియాడారు. గత కొన్ని సంవత్సరాలుగా డా. సంజయ్ ప్లాంట్ ఫీషియోలోజి, ప్లాంట్ బయోటెక్నాలజీ రంగాలపై పని చేసి నూతన కార్బన్ స్థిరీకరణ క్రియను కనుగొన్నట్లు తెలిపారు.

Share your comments

Subscribe Magazine

More on News

More