News

రిసర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 90వ వార్షికోత్సవ వేడుకలు:

KJ Staff
KJ Staff

బ్యాంకులకు బ్యాంకుగా పిలవబడే ఆర్బిఐ మొదలుపెట్టు 90 సంవత్సరాలు పూర్తయాయి. గత 90 ఏళ్లలో ఆర్బిఐ పనితీరులో, బాధ్యతల్లో ఘణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. భారత ఆర్ధిక వ్యవస్థను సక్రమంగా నిలిపేందుకు ఆర్బిఐ పనిచేస్తుంది. అందరికి తెలిసినట్లు ఆర్బిఐ కరెన్సీ నోట్లు ముద్రించి వాటిని జారీ చేస్తుందని మాత్రమే మనకు తెలుసు కానీ ఆర్బిఐ బాధ్యత ఇది ఒక్కటి మాత్రమే కాదు. దేశ ఆర్ధిక విధానాన్ని క్రమబద్దీకరించడమే కాకుండా ప్రభుత్వానికి సలహాదారుగా, భారత ప్రభుత్వ ప్రతినిధిగా పనిచేస్తుంది.

సాధారణంగా మనం ఆర్బిఐ డబ్బు ముద్రించగలదు కనుక ప్రతి ఒక్కరికి సరిపోయేంత డబ్బును ప్రింట్ చేసి పేదవారికి పంచిపెడ్తితే దేశంలో పేదరికాన్ని అరికట్టగలం అనే ఆలోచనలో ఉంటాం కానీ అది నిజం కాదు. లెక్కలు మించి డబ్బు మార్కెట్లో చలామణిలో ఉంటె దేశ ఆర్ధిక వ్యవస్థ దెబ్బతిని, ద్రవ్యోర్బనం ఏర్పడుతుంది, దీనినే ఇంగ్లీషులో ఇన్ఫ్లేషన్ అంటాము. ద్రవ్యోర్బనం ద్వారా మనకు 1 రూపాయికి దొరికే బన్ 100 రూపాయలకు కూడా దొరకిని పరిస్థితి వస్తుంది. ఇటివంటి పరిస్థితి తలెత్తకుండా ఆర్బిఐ ఆర్ధిక వ్యవస్థను సమత్యులంగా నియంత్రిస్తుంది. మార్కెట్లో ఏ నోట్లు చలామణిలో ఉండాలో ఏవి ఉండకూడదో నియంత్రించేది ఆర్బిఐ. ఇటీవల రద్దైన 2000 రూపాయిల నోట్లను ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

భారత దేశంలో కరెన్సీ నోట్లను ముద్రించి జారీ చేసే హక్కు ఒక్క ఆర్బిఐ కి మాత్రమే ఉంది. ఎంత కరెన్సీ మార్కెట్లో అందుబాటులో ఉండాలి, మరియు ఎటువంటి కరెన్సీ నోట్లు మార్కెట్లో ఉన్నాయ్ వాటి విలువ ఎంత ఉండాలి అని ఆర్బిఐ నిర్ణయిస్తుంది. భారత దేశంలో కరెన్సీ జారీ చెయ్యడానికి ఆర్బిఐ కనీస నిల్వ విధానాన్ని పాటిస్తుంది. 200 కోట్ల రూపాయిల వరకు బంగారం, విదేశీ మారక ద్రవ్య నిలువలను మాత్రమే ఆర్బిఐ ఉంచుకుంటుంది.

ఆర్బిఐ ప్రభుత్వ సలహాదారుగా కూడా పనిచేస్తుంది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు, సలహాదారుగా పనిచేసి, ఆర్ధిక వ్యవస్థను మెరుగుపరచడానికి సహాయం చేస్తుంది. ప్రభుత్వం చేసిన అప్పుల భారాన్ని ప్రజల మీద పడకుండా ప్రజలపై పడే ఋణభారాన్ని తగ్గించేందుకు పనిచేస్తుంది. రైతులకు మరియు వ్యవసాయ ఉపయోగాలకు రుణాలను అందించే నాబార్డ్ బ్యాంకుకు రుణాలను ఏర్పాటు చెయ్యడం, మరియు సంబంధిత డాటాను ప్రచురించడం ఆర్బిఐ నిర్వహిస్తుంది. అంతే కాకుండా మన అవసరాలకు రుణాలను ఇచ్చే బ్యాంకులకు రుణాలను ఆర్బిఐ ఇస్తుంది. బ్యాంకులు జారీచేసే రుణాలను నియంత్రించే బాధ్యతను ఆర్బిఐ స్వీకరించి, ఆర్ధిక వ్యవస్థలో తగినంత డబ్బు సరఫరా జరిగేవిధంగా చేసి, ద్రవ్యోర్బనం పరిస్థితి తలెత్తకుండా చేస్తుంది.

Share your comments

Subscribe Magazine