News

US Visa Fee Hike: పెరగనున్న అమెరికా వీసా ఫీజు.... నేటి నుండి కొత్త ఫీజు అమలు......

KJ Staff
KJ Staff

తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల్లో అమెరికాకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎంతో మంది యువత చదువు కోసం మరియు ఉద్యోగం కోసం అమెరికాకు వలస వెళ్తుంటారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ సంఖ్య అధికమవుతూ వస్తుంది. అమెరికాకు నివసించడానికి హెచ్-1-బి, ఎల్-1, ఈబి -5 వీసా అవసరం ఉంటుంది.ఈ వీసాలను పొందేందుకు వీసా ఫీజ్ చెలించవల్సి ఉంటుంది. అయితే యునైటెడ్ స్టేట్స్ సిటిజెన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఫీజ్ పెంచుతూ ఉత్తర్వులు జారీచేసింది. నోటిఫికేషన్ ప్రకారం పెరిగిన వీసా చార్జీలు ఏప్రిల్ ఒకటి నుండి అమల్లోకి రానున్నాయి.

దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత, అమెరికా వీసా చార్జీలు పెంచడం జరిగింది. చివరిగా 2016 లో వీసా ఫీజ్ పెంచారు. గతంతో పోలిస్తే ఇప్పుడు వీసా ఫీజ్ ఒకేసారి ఎనిమిదిరేట్లు పెరగనుంది.

కొత్త వీసా ఫీజ్:

కొత్తగా హెచ్-1-బి వీసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఫారం I-129 పూర్తిచెయ్యాలి, ఈ ఫారం రుసుము ఇప్పుడు 460 డాలర్ల నుండి 780 డాలర్లకు పెరిగింది. దీని విలువ మన కరెన్సీలో 38,000 రూపాయిల నుండి 64,000 రూపాయలకు పెరిగింది. అలాగే హెచ్-1-బి రిజిస్ట్రేషన్ ఫీజ్ 10 డాలర్ల నుండి 215 డాలర్లకు చేరుకుంది అంటే సుమారు 17,000 వేల రూపాయిలు అన్నమాట.

అలాగే ఎల్-1 వీసా గురించి చూసినట్లైతే, దీని విలువ ఏకంగా మూడు రేట్లు పెరిగింది. ఇప్పటివరకు ఉన్న 460 డాలర్ల (38,000 రూపాయిల ) రుసుము, 1385 డాలర్లకు పెరిగింది అంటే అక్షరాలా 1,10,000 రూపాయలు ఈ వీసా కోసం చెలించవల్సి ఉంటుంది. ఎల్-1 వీసా నాన్ ఇమిగ్రంట్ వీసా కేటగిరీ కిందకి వస్తుంది సాధారణంగా కామపిణీలో పనిచేసే ఉద్యోగుల బదలీ కోసం ఈ వీసాను ఉపయోగిస్తారు.

దానితోపాటుగా ఈబీ-5 వీసా చార్జీలు కూడా మూడు రేట్లు పెరగనున్నాయి. ప్రస్తుతం 3675 డాలర్లు ఉన్న ఈ వీసా రుసుము 11160 డాలర్లకు పెరగనుంది అంటే దాదాపు మన ఇండియన్ కరెన్సీలో తొమ్మిది లక్షల రూపాయిలు. అమెరికా వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టె పెట్టుబడి ధారులకోసం ఈ వీసా రూపొందించబడింది. ఈ వీసా పొందేందుకు అమెరికా వ్యాపారాల్లో కనీసం 5లక్షల డాలర్లు పెట్టుబడి పెట్టవలసిఉంటుంది దీని ద్వారా కుటుంబ సభ్యులకు వీసాలు పొందవచ్చు.

Share your comments

Subscribe Magazine