News

నేటి నుండి పెరగనున్న టోల్ టాక్స్.... పెరిగిన టోల్ టాక్స్ వివరాలు......

KJ Staff
KJ Staff

ప్రతి ఏడాది లాగానే ఈ సంవత్సరం కూడా టోల్ టాక్స్ పెంచుతున్నట్లు, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. పెరిగిన టోల్ టాక్స్ ఆదివారం అర్ధరాత్రి నుండి అమల్లోకి వచ్చింది. పెరిగిన టోల్ ధరలను వచ్చే ఆర్ధిక సంవత్సరం చివరి వరకు అంటే 2025, మార్చ్ 31 వరకు అమల్లో ఉంటాయి.

మన తెలుగు రాష్ట్రాల్లో కొత్త టోల్ చార్జీల ప్రకారం, ఇకనుండి కార్లు, జీపులు, వ్యాన్లు ఒకవైపు ప్రయాణానికి ప్రస్తుతం చెల్లిస్తున్న టోల్ చార్జికి అధనంగా 5రూ చెల్లించాలి మరియు రెండు వైపులా ప్రయాణానికి 10 రూపాయిలు అదనంగా చెల్లించాలి. తేలికపాటి రవాణా వాహనాలు ఒకవైపు ప్రయాణానికి 10 రూపాయిలు మరియు రెండు వైపులా ప్రయాణానికి 20 రూపాయలు అదనంగా చెల్లించవలసి ఉంటుంది. భారీ రవాణా వాహనాలకు వాహనం సైజును బట్టి 35-50 రూపాయిల వరకు అదనంగా చెల్లించాలి. ఇక బస్సులు, ట్రక్కుల నుండి 25-35 రూపాయిల వరకు అధనంగా వసూలు చెయ్యనున్నారు. అంతేకాకుండా వాహనాలు 24 గంటలలోపు తిరిగి ప్రయాణం చేస్తే అన్ని రకాల వాహాల టోల్ టాక్సలో 25% రాయితీ ఉంటుందని వెల్లడించారు.

మనలో చాల మందికి అసలు టోల్ టాక్స్ ఎందుకు వాసులు చేస్తారన్న అనుమానం ఉంటుంది. దేశంలోని రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి కేంద్ర రవాణ, జాతియ రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కృషి చేస్తుంది. దేశంలోని వివిధ రాష్ట్రాలను అనుసంధానం చేసేందుకు, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, హైవేలు, ఎక్ష్ప్రెస్స్ హైవేలు, కొన్ని ప్రైవేట్ సంస్థల సాయంతో నిర్మిస్తుంది. అయితే ఈ హైవే నిర్మాణానికి అయిన ఖర్చు మొత్తం, వాహన దారుల నుండి టోల్ టాక్స్ రూపంలో వాసులు చేసి, కాంట్రాక్టర్లకు చెలిస్తారు. ఈ ప్రక్రియ పూర్తవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. రోడ్ నిర్మాణానికి అయిన ఖర్చు మొత్తం వాసులు అయినా తర్వాత టోల్ ఫీజ్ 40% తగ్గించాలన్న నిబంధన ఉంది.

మనం వాహనం ఖరీదుచేసే సమయంలో, ఎన్నో రకాల టాక్సులు చెల్లిస్తాం వాటిలో రోడ్ టాక్స్ ఒకటి, కానీ ఈ రోడ్ టాక్స్ తో పాటు ప్రతి సారి హైవే పై ప్రయాణం చేసే సమయంలో టోల్ టాక్స్ తప్పని సరిగా చెల్లించాలి. ద్విచక్ర వాహనాలు మరియు ఆటోలు మినహా మిగిలిన అన్ని వాహనాలకు, వాహన పరిమాణం బట్టి, ఇంజిన్ సామర్ధ్యం బట్టి, టోల్ టాక్స్ వసూలు చేస్తారు. టోల్ ప్లాజాలో టోల్ టాక్స్ కలెక్ట్ చేస్తారు, సాధారణంగా రెండు టోల్ ప్లాజాల మధ్య దూరం 60 కిలోమీటర్లు ఉంటుంది ఇంతకన్నా తక్కువ కానీ ఎక్కువ కూడా ఉండే అవకాశం ఉంది. వాహనదారుల సౌకర్యాదం టోల్ ప్లాజాల వద్ద తాగునీరు, మరుగు దొడ్లు వంటి వాటిని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.

హైవే పై ప్రయాణించే అన్ని వాహనాలకు టోల్ ఉండదు. ప్రభుత్వానికి చెందిన కొందరికి మినహాయింపులు ఉంటాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాన మంత్రి, ముఖ్య మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీలు, స్పీకర్లు, గవర్నర్, న్యాయమూర్తి, ఆర్మీ వాహనాలు, పోలీస్ ఉన్నత అధికారులు ప్రయాణించే అవకాశం ఉండదు. అత్యవసర సేవలకు వినియోగించే, అంబులెన్సు, అగ్నిమాపక వాహనం, మొదలగు వాహనాలు టోల్ టాక్స్ చెల్లించనవసరం లేదు. మిగిలిన వాహనాలన్నీ టోల్ ఖచ్చితంగా చెల్లించాలి. నగదు రూపంలో టోల్ చెలిస్తున్న సమయంలో, టోల్ ప్లాజాల వద్ద అధికంగా రద్దీ ఉండేది, పండుగ సమయాల్లో అయితే రద్దీ మరింత ఎక్కువై వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదురుకునేవారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఫాస్ట్ ట్యాగ్ కారణంగా టోల్ ప్లాజాల వద్ద వాహాలను నిలిచిపోవడం చాల వరకు తగ్గింది. ఫాస్ట్ ట్యాగ్ సహాయంతో, టోల్ టాక్స్ వాహనదారుని బ్యాంకు ఖాతా నుండి నేరుగా వసూల్ అవుతుంది, తద్వారా రద్దీ తగ్గి ప్రయాణం మరింత సులభతరమయ్యింది.

Share your comments

Subscribe Magazine