News

పౌల్ట్రీ ఫార్మ్ పెట్టాలనుకునేవారికి శుభవార్త.....

KJ Staff
KJ Staff

ఈ మధ్యకాలంలో ఎంతో మంది యువత స్వయం ఉపాధే లక్ష్యంగా, వ్యవసాయ రంగంవైపు అడుగులువేస్తున్నారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు తెచ్చిపెట్టే వ్యాపారాల్లో పౌల్ట్రీ ఫార్మ్ ఒకటి. కొత్తగా బిజినెస్ మొదలుపెడదాం అనుకునే వారికీ పౌల్ట్రీ ఫార్మ్ ఒక అనువైన వ్యాపారం. చాల మందికి పౌల్ట్రీ ఫార్మ్ మొదలుపెట్టాలని ఉన్నా, దీనికి సంబంధించిన శిక్షణ ఎక్కడ దొరుకుతుంది అని తెలియక తికమక పడుతూ ఉంటారు. అటువంటి వారికి ICAR-CARI ఒక అమూల్యమైన అవకాశం కల్పిస్తుంది.

మన రెండు తెలుగు రాష్ట్రాల్లో, పౌల్ట్రీ ఫార్మ్ గురించి తెలియని వారు ఉండరు. ఒక్క ఆంధ్రప్రదేశ్ నుండే దేశానికీ సరిపడా కోడి గుడ్లు రవాణా అవుతాయి. అందుకే ఆంధ్ర రాష్ట్రాన్ని" ఎగ్ బౌల్ ఆఫ్ ఇండియాగా" పరిగణిస్తారు. సరైన రక్షణ చర్యలు పాటిస్తే పౌల్ట్రీ ఫార్మ్ నుండి అధిక లాభాలు పొందవచ్చు. చాల మందికి పౌల్ట్రీ ఫార్మ్ ప్రారంభించాలని ఉన్నా ఎక్కడ మొదలుపెట్టాలి అని సంకోచంలో ఉంటారు. అలాంటివారి కోసం సెంట్రల్ ఏవియన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు మే నెలలో ఐదు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. పౌల్ట్రీ రైతులకు ఇది ఒక సువర్ణావకాశం.

సెంట్రల్ ఏవియన్ రెసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు, ఎంట్రప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాం(EDP) పేరిట మే 13 నుండి మే 17 వరకు శిక్షణ తరగతులు నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు ఆన్లైన్లో మరియు ఆఫ్లైన్ విధానంలో హాజరు కావచ్చు. ఈ కార్యక్రమంలో హాజరయ్యేవారికి పౌల్ట్రీ కోళ్ల పెంపకం గురించి న్యాన్యమైన గుడ్ల ఉత్పత్తి గురించి బోధిస్తారు. దానితోపాటుగా ఆర్గానిక్ విధానంలో కోళ్ల పెంపకం, మరియు నాటుకోళ్ల పెంపకం, మార్కెటింగ్ విధానాలు ఇలా అనేక అంశాల మీద అవగహన కల్పిస్తారు.

పౌల్ట్రీ ఫార్మ్ పెట్టాలన్న ఆలోచన ఉన్న, ఆర్ధికంగా ముందుకు వెళ్లలేని వారికోసం ప్రభుత్వం అందిస్తున్న ఫైనానాసింగ్ స్కీమ్స్ గురించి తెలియపరచి వాటిని పొందడానికి అవసరమయ్యే ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎలా తయారు చెయ్యాలన్న విషయంపై మీకు పూర్తివివరాలు అందిస్తారు. మరింకెందుకు ఆలస్యం, పౌల్ట్రీ ఫార్మ్ స్థాపించాలన్న మీ కలను సాకారం చేసుకోవడానికి వెంటనే ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం లో నమోదు చేసుకోండి. ఈ కార్యక్రమం కోసం 2024 మే 10 వరకు నమోదు చేసుకోవచ్చు

Fee Details: ఆన్లైన్లో పాల్గొనేవారు- 1500 రూ చెల్లించాలి
                    ఆఫ్లైన్లో పాల్గొనేవారు - 2500 రూ చెల్లించాలి

ఈ కార్యక్రమం కోసం నమోదు చేసుకోవాలి అనుకునేవారు ముందుగా ఈ కోర్సు కోసం ఫీజ్ చెల్లించి తరువాత ఫారం పూర్తిచెయ్యాలి

పేమెంట్ వివరాలు: ICAR-CARI Payment Gateway
రిజిస్ట్రేషన్ వివరాలు: Registration Form

Share your comments

Subscribe Magazine