News

రైతన్నలు ఈ పథకం లో చెరితే .. ప్రతీ నెలా రూ.3,000 పెన్షన్ పొందవచ్చు !

Srikanth B
Srikanth B

కేంద్ర ప్రభుత్వం రైతులకు అందించే పథకాల్లో అందరికి తెలిసింది పీఎం కిసాన్ సంవత్సరం లో మూడు విడతలుగా రూ . 6000 వేలు రైతులకు పెట్టుబడి సాయం అందిస్తుంది . అయితే రైతులకు పెన్షన్ అందించే పథకం ఒకటుందని చాల మంది రైతులకు తెలియదు అయితే రైతులు నెలకు 50 రూపాయల మొత్తాన్ని చెల్లించి నెలకు రూ . 3000 వరకు పొందే పథకం కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తుంది ఆ పథకమే ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన .

రైతు నెలకు 50 రూపాయల మొత్తం చెల్లించి ..రూ . 3000 వరకు పెన్షన్ అందించే అద్భుత పథకం కేంద్రం అందిస్తున్న ఈ స్కీమ్స్ వలన చాలా మందికి ప్రయోజనం కలుగుతోంది. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం కూడా కొన్ని పథకాల్ని తీసుకు వచ్చింది.


ఎంత కట్టాలి..? ఎంత వస్తుంది..?

రైతుల వయస్సును బట్టి రూ.55 నుంచి రూ.200 మధ్య ఉంటుంది. ఉదాహరణకు 18 ఏళ్ల వయస్సు వున్నప్పుడు ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే… 18 ఏళ్ల వారు రూ.55 ప్రీమియం, 30 ఏళ్ల వారు రూ.110 ప్రీమియం, 40 ఏళ్ల వారు రూ.200 ప్రీమియం చెల్లించాలి.

ఇలా 60 ఏళ్ల దాకా కట్టాలి. 60 ఏళ్లు వయస్సు దాటగానే ప్రతీ నెలా రూ.3,000 చొప్పున పెన్షన్ ని ప్రభుత్వం ఇస్తుంది. ఒకవేళ రైతు మరణిస్తే వారి జీవిత భాగస్వామి మిగతా ప్రీమియంలు చెల్లించి పెన్షన్ పొందవచ్చు. ఒకవేళ పెన్షన్ తీసుకుంటున్న రైతు మరణిస్తే వారి జీవిత భాగస్వామికి 50 శాతం ఫ్యామిలీ పెన్షన్ లభిస్తుంది.


ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన పథకం ప్రయోజనాలు :

ఈ స్కీమ్ 2019లో ప్రారంభమైంది.
రైతులకి ఆర్థికంగా అండగా నిలిచేందుకు ఈ పెన్షన్ స్కీమ్ ని కేంద్రం ప్రారంభించింది.
18 ఏళ్ల నుంచి గరిష్టంగా 40 ఏళ్ల వయస్సులోపు వున్నా రైతులు దీనిలో చేరచ్చు.

ప్రతీ నెలా రూ.3,000 పెన్షన్ ని మనం ఈ స్కీమ్ కింద పొందొచ్చు.
రెండు హెక్టార్ల లోపు పొలం ఉన్న రైతులు ఈ పెన్షన్ స్కీమ్‌లో చేరొచ్చు.

Related Topics

PM kisan

Share your comments

Subscribe Magazine

More on News

More