Government Schemes

ఎల్.ఐ.సి పాలసీ: ఈ ఎల్.ఐ.సి పాలసీ ఎంచుకుంటే రూ. 15,00,000 వరకు రిటర్న్స్

KJ Staff
KJ Staff

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అఫ్ ఇండియా దేశంలో వివిధ వర్గాలకు వివిధ రకాల ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకువస్తుంది. ఈ పాలసీలు అనేవి పిల్లలకు, మహిళలకు, సీనియర్ సిటిజన్స్ కని వివిధ రకాలుగా అందిస్తుంది. ఈ ఎల్.ఐ.సి పాలసిల్లో ఎక్కువ రిటర్న్స్ వచ్చే పాలసీలు పాపులర్ అవుతుంటాయి. కాబట్టి ఎక్కువ ప్రజలు ఈ ఎల్.ఐ.సి పాలసీ తీసుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు. జీవం ఉమాంగ్ పాలసీ ఎనేది ఆ పాపులర్ పాలసీల్లో ఒకటి. ఈ పాలసీ సమగ్ర జీవిత కవరేజీని, మరియు మంచి రిటర్న్స్ ఇచ్చే పాలసీ. ఈ ప్లాన్ను దీర్ఘకాలం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వారు ఎంచుకోవచ్చు.

ఈ ఎల్.ఐ.సి జీవన్ ఉమాంగ్ పాలసీతో మెచ్యూరిటీ తరువాత కూడా లాభాలు లభిస్తాయి. దీనినే సర్వైవల్ బెనిఫిట్స్ అని కూడా అంటారు. పాలసీహోల్డర్ మెచ్యూరిటీ వరకు ప్రీమియం డబ్బులు చెల్లించాలి. ఆ తర్వాత సర్వైవల్ బెనిఫిట్స్ వారికీ వర్తిస్తాయి. మెచ్యూరిటీ సమయంలో మెచ్యూరిటీ బెనిఫిట్స్ పొందవచ్చు. పాలసీ ముగిసిన తర్వాత కూడా ప్రయోజనం పొందాలనుకునేవారు ఈ పాలసీని ఉత్తమంగా తీసుకోవచ్చు.

ఈ ఎల్.ఐ.సి జీవన్ ఉమాంగ్ పాలసీని కనీసం రూ. 2 లక్షలు బేసిక్ సమ్ అష్యుర్డుతో తీసుకోవచ్చు. గరిష్టంగా ఎంత సమ్ అష్యుర్డ్ అయినా ఎంచుకోవచ్చు. ఈ ప్రీమియం పాలసీ చెల్లించడానికి 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25ఏళ్ళు మరియు 30 ఏళ్లుగా ఉంటుంది. 40 ఏళ్ల వయస్సులో పాలసీ తీసుకుంటే పాలసీ టర్మ్ వచ్చేసి 65 ఏళ్లగా ఉంటుంది. ఈ పాలసీకి అర్హులు కావడానికి 90 రోజులు కనీస వయసు ఉండాలి. 55 ఏళ్ళు అనేది గరిష్ట వయస్సు, మరియు మెచ్యూరిటీ వయస్సు వచ్చేసి 100 ఏళ్ళు. ఈ పాలసీని 8 ఎళ్ల లోపు ఉన్నవారు తీసుకుంటే రిస్క్ కవర్ అనేది రెండేళ్ల తర్వాత నుండి మొదలవుతుంది. ఒకవేళ వయస్సు 8 ఏళ్ల పైన ఉంటె రిస్క్ కవర్ అనేది వెంటనే మొదలవుతుంది.

ఇది కూడా చదవండి..

స్మాల్ సేవింగ్స్ స్కీం : ఫిక్స్డ్ డిపాజిట్ల కన్నా మెరుగైన పథకం

ఈ పాలసీ రిటర్న్స్ విషయానికి వస్తే పాలసీహోల్డర్ వారి ఆఖరి ప్రీమియం చెల్లించిన తర్వాత నుండి సర్వైవల్ బెనిఫిట్స్ లభిస్తాయి. అష్యుర్డ్ లో 8 శాతం చొప్పున లెక్కించి ప్రతి ఏడాది సర్వైవల్ బెనిఫిట్ అందిస్తారు. ఈ విధంగా 99 ఎళ్ల వయసు వచ్చేవరకు లబ్దిపొందుతారు. 100 ఏళ్ళు పూర్తైన తర్వాత మెచ్యూరిటీ డబ్బులు వస్తాయి. ఉదాహరణకు 25 ఎలళ్ల వయసున్న ఒక వ్యక్తి 30 ఏళ్ళు ప్రీమియం చెల్లించేలా రూ. 5 లక్షలు బేసిక్ సమ్ అష్యుర్డుతో ఈ పాలసీని తీసుకుంటే, ప్రతి సంవత్సరం రూ. 14,758 ప్రీమియం చెల్లించాలి. సర్వైవల్ బెనిఫిట్ కింద ప్రతి సంవత్సరం రూ. 40,000, 30 ఏళ్ల ప్రీమియం పూర్తయిన తర్వాత లభిస్తాయి. రూ. 5 లక్షలు వరకు మెచ్యూరిటీ సమయంలో వస్తాయి. దీనితో పాటు సుమారు రూ.10 లక్షలు పైనే బోనస్ లభిస్తుంది.

ఇది కూడా చదవండి..

స్మాల్ సేవింగ్స్ స్కీం : ఫిక్స్డ్ డిపాజిట్ల కన్నా మెరుగైన పథకం

Related Topics

lic policy scheme

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More