చేవెళ్ల సభలో ఎస్సీ, ఎస్టీ వర్గాలను చేరుస్తూ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. సోనియా ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే 12 కీలక అంశాలను రేవంత్ జాబితా చేశారు. ఈ చర్యల అమలుతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంటుందన్న విశ్వాసం బలంగా ఉంది.
రేవంత్ రెడ్డి ప్రకటించిన ఎస్సీ,ఎస్టీ డిక్లరేషన్ లోని ముఖ్యాంశాలు
➨ ఎస్సీ,ఎస్టీ విద్యార్థులు పదో తరగతిని పూర్తి చేస్తే, వారికి రూ.10 వేలు
➨ ఇంటర్ పూర్తి చేస్తే, వారికి రూ. 15 వేలు
➨ డిగ్రీ పూర్తి చేస్తే, వారికి రూ. 25 వేలు
➨ ఈ వర్గంలో వారు పీజీ పూర్తి చేస్తే, వారికి రూ. లక్ష రూపాయలు
➨ ఈ వర్గంలో వారు పీహెచ్ డీ పూర్తి చేస్తే, వారికి రూ.5 లక్షలు
➨ విద్యార్థులు విదేశాల్లో చదువుకోవాలనుకుంటే వారికి ఆర్ధిక సహాయం
➨ మండలానికి ఒక ఎస్సీ, ఎస్టీ గురుకుల స్కూల్స్
ఇది కూడా చదవండి..
రైతుల నుండి అక్టోబర్ చివరిలో ఖరీఫ్ ధాన్యం సేకరణ.. కనీస మద్దతు ధర ఎంతంటే?
➨ గ్రాడ్యుయేషన్ చదువుతున్న విద్యార్థులకు ఉచిత హాస్టల్స్
➨ ఎస్టీలకు ఇచ్చిన పోడు భూములకు సర్వహక్కులు
➨ ఎస్సీలకు అసైన్డ్ భూములకు పట్టాలు
➨ ఎస్సీ, ఎస్టీలకు అంబేద్కర్ అభయం హస్తం పథకం కింద వారికి రూ. 12 లక్షలు
➨ ప్రతి సంవత్సరం గిరిజన తండాలకు రూ. 15 లక్షలు
➨ ఎస్సీ, ఎస్టీలకు ప్రైవేట్ విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు
➨ జనభా ప్రకారం ఎస్సీలకు 18, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు
➨ ఇందిరమ్మ పక్కా ఇండ్ల కింద ఎస్సీ, ఎస్టీలకు రూ. 6లక్షలు
ఇది కూడా చదవండి..
Share your comments