News

IFFCO Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ఇఫ్కో లో AGT మరియు ట్రైనీల ఖాళీలు జీతం నెలకి 70,000 వరకు

S Vinay
S Vinay

భారతీయ రైతుల ఎరువుల సంస్థ లో నియామకాలకై దరఖాస్తులని ఆహ్వానిస్తుంది AGTలు, ట్రైనీ ల వంటి వివిధ విభాగాలలో ఖాళీలను భర్తీ చేయనుంది.దీనికి సంబంధించిన పోస్టుల వివరాలు, దరఖాస్తు విధానం,దరఖాస్తుకి చివరి తేదీ వంటి పూర్తి వివరాలను ఆసక్తి గల అభ్యర్థులు తెలుసుకోండి.

AGT మరియు అకౌంట్స్ ట్రైనీ కోసం దరఖాస్తుకి చివరి తేదీ - 15 ఏప్రిల్ 2022

ట్రైనీ కి చివరి తేదీ- 03 ఏప్రిల్ 2022

AGT పోస్ట్ విద్యార్హత:
నాలుగు సంవత్సరాల B.Sc. (వ్యవసాయం). జనరల్/OBC విద్యార్థులు కనీసం 60% ఉతీర్ణత మరియు SC/ST అభ్యర్థులు B.Sc (వ్యవసాయం) డిగ్రీలో కనీసం 55% ఉతీర్ణత సాధించినవారు అర్హులు.

IFFCO AGT Recruitment 2022 కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా వారు దరఖాస్తు చేస్తున్న రాష్ట్రంలోని ప్రాంతీయ భాష చదవడం, రాయడం మరియు మాట్లాడటం వంటివి తెలిసి ఉండాలి
AGT పోస్ట్‌ల కోసం అభ్యర్థులు ఆన్‌లైన్ ప్రిలిమ్స్ పరీక్షమెయిన్స్ పరీక్ష ద్వారా ఎంపిక చేయబడతారు.

ట్రైనీ అకౌంట్ (Trainee Accounts)
CA (Intermediate) తో పాటు కామర్స్‌లో గ్రాడ్యుయేషన్. కనీసం 60% ఉతీర్ణత సాధించినవారు అర్హులు.

ట్రైనీ లీగల్(Trainee Legal)
భారత ప్రభుత్వంలోని మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ & ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ ద్వారా గుర్తించబడిన సంస్థ నుండి పదో తరగతి తర్వాత ప్లాస్టిక్ ప్రాసెసింగ్ ఆపరేటర్ యొక్క ట్రేడ్‌లో ఒక సంవత్సరం ఫుల్-టైమ్ రెగ్యులర్ ITI కోర్సు చేసి ఉండాలి. 2018 సంవత్సరం నుండి ఉతీర్ణులు అయిన వారు మాత్రమే అర్హులు.

జీతాల వివరాలు:
AGT:శిక్షణ సమయంలో, ఇఫ్కో నిబంధనల ప్రకారం నెలవారీ స్టైఫండ్ రూ.36000/-తోపాటు ఇతరభత్యాలు . ఒక సంవత్సరం శిక్షణను పూర్తి చేసిన తర్వాత రూ 40,000-75,000.


ట్రైనీ అకౌంట్ (Trainee Accounts):
శిక్షణ సమయంలో, ఇఫ్కో నిబంధనల ప్రకారం నెలవారీ స్టైఫండ్ రూ.36000/-తోపాటు ఇతరభత్యాలు . ఒక సంవత్సరం శిక్షణను పూర్తి చేసిన తర్వాత రూ 40,000-75,000.

ట్రైనీ లీగల్(Trainee Legal)

IFFCO నిబంధనల ప్రకారం నెలవారీ ఏకీకృత స్టైఫండ్ రూ.7, 700/-తోపాటు ఇతర అలవెన్సులపై ఒక సంవత్సరం అప్రెంటిస్‌షిప్ శిక్షణ. తరవాత ఇఫ్కో ట్రైనీగా రెండు సంవత్సరాల శిక్షణలో మొదటి సంవత్సరం నెలవారీ స్టైఫండ్ రూ. 28400/- & నిబంధనల రెండవ సంవత్సరంలో 29,300/- మరియు ఇతర అలోవెన్సులు.

దరఖాస్తు చేయడం ఎలా:
అభ్యర్థులు కింద పొందు పరిచిన లింకులతో ఆయా పోస్టులకి దరఖాస్తు చేసుకోవచ్చు.

Official Notification of AGT Recruitment

Official Notification of Trainee Legal

Official Notification of Trainee Accounts


మరిన్ని చదవండి.

Indian Army Recruitment 2022: భారత ఆర్మీ లో టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం జీతం రూ. 56,100 నుండి 1,77,500 వరకు

Share your comments

Subscribe Magazine

More on News

More