News

Indian Army Recruitment 2022: భారత ఆర్మీ లో టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం జీతం రూ. 56,100 నుండి 1,77,500 వరకు

S Vinay
S Vinay

ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) వివిధ ఖాళీల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత మరియు ఆసక్తిగల అభ్యర్థులు పూర్తి వివరాలు చదవండి.

అవివాహిత స్త్రీ , పురుష అభ్యర్థులకు మరియు సైన్యంలో సేవలందిస్తూ ప్రాణాలు కోల్పోయిన ఇండియన్ సిబ్బంది యొక్క వితంతువుల కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.
మొత్తం ఖాళీలు:191

ఖాళీల వివరాలు:
SSC టెక్ మెన్ - 175
SSC టెక్ ఉమెన్ - 14
విడోస్ ఆఫ్ డిఫెన్స్ పర్సనల్ - 2

విద్యార్హత:
అభ్యర్థులు తప్పనిసరిగా ఇంజినీరింగ్ డిగ్రీ కోర్సు చేసి ఉండాలి లేదా ఇంజినీరింగ్ డిగ్రీ కోర్సు చివరి సంవత్సరం చదువుతూ ఉండాలి.

వయో పరిమితి
SSC (టెక్) మరియు SSCW(టెక్) - అక్టోబర్ 1, 2022 నాటికి 20 నుండి 27 సంవత్సరాలు (అభ్యర్థులు 02 అక్టోబర్ 1995 మరియు 01 అక్టోబర్ 2002 మధ్య జన్మించినవారు, రెండు రోజులు కలుపుకొని).
భారత సాయుధ దళాల రక్షణ సిబ్బంది యొక్క వితంతువుల కోసం: అక్టోబర్ 1, 2022 నాటికి గరిష్టంగా 35 సంవత్సరాల వయస్సు.

దరఖాస్తు చివరి తేదీ :ఏప్రిల్ 6, 2022.

ఎంపిక విధానం:
ముఖాముఖీ పరీక్ష మరియు వైద్య పరీక్ష

దరఖాస్తు చేయడం ఎలా:
ముందుగా www.joinindianarmy.nic.in అనే అధికారక వెబ్సైట్ కి వెళ్ళండి

హోమ్ పేజీ లో అప్లై దగ్గర క్లిక్ చేయండి

తర్వాత న్యూ రిజిస్ట్రేషన్ ని నొక్కండి.

ఇక్కడ మీ వ్యక్తిగత వివరాలను మరియు విద్యార్హత వివరాలను జాగ్రత్తగా నమోదు చేసుకోండి,

చివరగా భవిష్యత్తు అవసరాలకై అప్లికేషన్ ఫార్మ్ ని డౌన్లోడ్ చేసుకోండి.

మరిన్ని చదవండి.

TS EAMCET 2022 :నోటిఫికేషన్ విడుదల!

రైతుల ఆదాయాన్ని పెంచే విధానాలను నిర్దేశిస్తూ 'Indian Agriculture towards 2030' పుస్తక ఆవిష్కరణ!

Share your comments

Subscribe Magazine