రెండు మూడు రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలో అక్కడక్కడా మోస్తరు వర్షాలు పడుతూనే వున్నాయి .. మరి కొన్ని జిల్లాలో ప్రజలు ఉక్కపోతకు అల్లాడుతున్నారు ఈక్రమంలో IMD (వాతావరణశాఖ )హైదరాబాద్ కేంద్రం చల్లటి వార్త అందించింది నేడు రేపు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.అదేవిధంగా పలుజిల్లాలో అతి భారీ నుంచి భారీ వర్షాలు కురుస్తాయని కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
నేడు రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్,నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, కామారెడ్డి జిల్లాలలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాలలో అక్కడక్కడ కురిసఅవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేసింది.
శనివారం కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వచ్చే శనివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
రైతులకు శుభవార్త : లక్ష లోపు రుణాలు అన్ని మాఫీ
ప్రస్తుతం విస్తరించి వున్నా ఆవర్తనం ప్రభావంతో ఆగస్టు 18వ తేదీ నాటికి ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
Share your comments