
ఒకవైపు భానుడి భగభగలు తెలంగాణ రాష్ట్రన్ని భగ్గుమనిపిస్తుంటే, నీటిఎద్దడి లేక భూమి ఎండిపోతుంది. ఇంకా మే కూడా రాలేదు, మార్చ్ లోనే ఉంటే పరిస్థితి ఏంటా అని అల్లాడుతున్న ప్రజలకి వాతావరణ శాఖ ఒక శుభవార్తను అందించింది. మన అదృష్టం కొద్దీ ఈ నెల 21వ తేదీ నుంచి మొదలుకొని తెలంగాణలో పలు చోట్ల వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఐఎండీ తెలిపింది. ఈ పెరుగుతన్న ఉష్ణోగ్రతలు ప్రజలను తీవ్రంగా భాద పెడుతున్నాయి. ఇలా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న తరుణంలో, వర్షాలు కురిస్తే తాత్కాలికమే అయినా సరే ఉపశమనం లభిస్తుందని కదా అని ప్రజలు ఆశపడుతున్నారు.
ఈ సంవత్సరం ఫిబ్రవరి నుండే ఎండలు దంచి కొట్టడం మొదలైంది. దాంతో భూములు నెర్రలు బారి పంటలకు భారీనష్టం వాటిల్లుతోంది. ఇప్పటికే తెలంగాణాలో నీటి ఎద్దడి లేక ట్యాంకర్లలో నీళ్లు తెచ్చి మరి పొలానికి నీరు అందించాలిసిన ఘోర పరిస్థితి నెలకొంది. అయితే ఇంకా మేనెల రాకుండానే మార్చ్ లోనే రికార్డు స్థాయి లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం ప్రమాదకరం అని, వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
ఇప్పటికే తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాలో 41 డిగ్రీల దాకా ఎండ తీవ్రత నమోదు అయ్యింది. అయితే గోరుచుట్టు పై రోకలి పోటు లాగా ఎండా తో పాటుగా తీవ్ర మైన వడగాల్పులు కూడా రాబోతున్నాయని, ఐఎండీ బాంబు పేల్చింది. దీని మేరకు ఆయా జిల్లాలను ఎల్లో, ఆరెంజ్ జోన్లు గా ప్రకటనలు కూడా జారీ అవుతున్నాయి.
ఇక ఉత్తర తెలంగాణా అయితే ఎర్రగా కాలుతున్న పెనం లాగా తయారు అయ్యింది. నిర్మల్, నిజామాబాదు, ఆదిలాబాదు, మంచిర్యాల, ఇలా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.
ప్రస్తుతం 20వ తేదీ దాకా, పొడిగాలులు వీచే అవకాశం ఉన్నా, 21 నుండి మాత్రం తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది.
పంట ఎండ పెట్టుకున్న రైతులు అప్రమత్తంగా ఉండి, ముందస్తు చర్యలు చెప్చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.
అదీకాక రోజువారీ పనులకోసం ఎండలో పడిగాపులు కాసే సాధారణ జనం మాత్రం తప్పనిసరిగా ఎండలో ఉన్నప్పుడు తడిగుడ్డతో మొహం తుడుచుకోవడం, టోపీ వంటివి ధరించడం, తాగడానికి నీళ్లు వెంటబెట్టుకోవడం తప్పనిసరిగా చెయ్యాలని నిపుణుల సూచన. అలానే ఎండలో ప్రయాణం చేసే వారు కుదిరితే తలకి తడి గుడ్డని చుట్టుకోవాలని..బండి పై వెళ్లే వారు హెల్మెట్ పెట్టుకోవాలని తెలియజేశారు.
Share your comments