కాస్త తెరుపు ఇచ్చినట్టు ఇచ్చి హైదరాబాద్ లో నిన్న భారీ వర్షం కురిసింది పంజాగుట్ట, బంజారాహిల్స్, అమీర్పేట్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో భారీగా వర్షం కురవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు రానున్న మూడు రోజుల పటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
రాష్ట్రంలో మరికొన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతవారణశాఖ హెచ్చరించింది. 11.56 సెంటీ మీటర్ల నుంచి 20 సెంటీ మీటర్ల మేర వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లొద్దని సూచించింది.
శుక్రవారం రాష్ట్రంలోని కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది .
రైతులకు శుభవార్త : లక్ష లోపు రుణాలు అన్ని మాఫీ
ఆంధ్రప్రదేశ్ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా రానున్న 3 రోజులలో నల్లగొండ, హైదరాబాద్, యాదాద్రి-భువనగిరి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, సిద్దిపేట జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది .
Share your comments