Rain Alert: తెలంగాణ మరియు రాయలసీమ కుం రాగల 3 రోజులు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. కొన్ని జిల్లాల్లో తేదీ (ఏప్రిల్ 26,27) ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది ఈశాన్య మధ్యప్రదేశ్ నుండి దక్షిణ కర్ణాటక వరకు సముద్ర మట్టం పై 0.9 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతున్నట్లు తెలిపింది. దీని ప్రభావంతోనే తెలంగాణకు మరియు రాయలసీమ లో తేలిక నుంచి ఒక ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది
Telugu States Weather Report: తెలంగాణలో రాగల 3 రోజులు ఏపీలోని రాయలసీమలో ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఏపీ, యానాంలలో నైరుతి గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం వుంది . ఇవాళ తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఒకటి రెండు చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3 నుంచి 5 డిగ్రీలు నుంచి ఒక మోస్తరు వర్షాలు ,గాలులు ఒకటి రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
రేపు (ఏప్రిల్ 26) తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదు కావొచ్చు. ఒకటి, రెండు చోట్ల వడగాలులు వీచే అవకాశం ఉంది. ఎల్లుండి (ఏప్రిల్ 27) వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది.
Share your comments