News

తెలంగాణకు వర్ష సూచనా ... రానున్న 3 రోజుల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం!

Srikanth B
Srikanth B
తెలంగాణకు వర్ష సూచనా!
తెలంగాణకు వర్ష సూచనా!

తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. నేటి (జూన్ 10 నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. శుక్ర ,శని వారాల్లో (జూన్ 8, 9) ఆసిఫాబాద్, మంచిర్యాల, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట ఆదిలాబాద్, కుమ్రం భీమ్  జిల్లాల్లో.. శనివారం  ఆదిలాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.

శని, ఆదివారాల్లో (జూన్ 11, 12)తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

నిన్న ఉదయం 8.30 గం. సమయంలో నల్గొండలో అత్యల్పంగా 25 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రామగుండంలో అత్యధికంగా 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కొన్నిచోట్ల మబ్బు పట్టినట్లు ఉన్నప్పటికీ ఉక్కపోత, వేడితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

తూర్పు మధ్యప్రదేశ్ నుంచి రాయలసీమ వరకు విస్తరించి ఉన్న ఉపరితల ధ్రోణి ఇవాళ ఛత్తీస్‌గఢ్ నుంచి కోస్తాంద్ర తీరం వరకు వ్యాపించి ఉంది. సముద్రం మట్టం నుంచి 1.5 కి.మీ ఎత్తులో ధ్రోణి ఆవరించి ఉంది.

ప్లాస్టిక్ నిషేధం...పాడి రైతులకి నష్టం?

ఈ ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి.

"ప్రభుత్వ వైద్యులు జనరిక్ మందులను మాత్రమే రాయాలి"-ఆరోగ్య శాఖ మంత్రి

Related Topics

IMD issues rain Telangana

Share your comments

Subscribe Magazine