ఇటీవలి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అనూహ్యంగా కురిసిన వర్షాలకు రాష్ట్రంలోని రైతాంగం సవాలక్ష పరిస్థితులను ఎదుర్కొంటోంది. గత పది రోజులుగా ఈ రైతులకు చాలా కష్టంగా ఉంది, ఎందుకంటే వారి పంటలన్నీ నీటితో మునిగిపోయాయి. చేతికి అందాల్సిన పంటలు అన్ని నీట మునగడంతో రైతులకు పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లింది.
భారీ వర్షాల కారణంగా ధాన్యం నిల్వ ఉన్న కల్లాలు, కొనుగోలు కేంద్రాలు మెజారిటీ నీటమునిగి ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో ప్రస్తుతం రైతులు పండించిన పంటకు లాభం లేకుండా పోయే పరిస్థితి నెలకొంది. ఈ సమస్యను పరిష్కారంగాను రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వం అకాల వర్షాల వల్ల నష్టం వాటిల్లిన రైతులను ఆదుకుంటాం అని వెల్లడించింది. ఇటీవలి మే నెలలో వైఎస్సార్ రైతుభరోసా డబ్బులను జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం మనకు తెలిసినదే. తాజాగా ప్రభుత్వం రైతులకు ఈ నెలలోనే వైఎస్సార్ రైతుభరోసా డబ్బులు మరియు వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ఇన్ ఫుట్ సబ్సిడీ అందించాలని నిర్ణయం తీసుకుంది. అధికారులను దీనికి సంబంధించిన చర్యలు వెంటనే తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఇది కూడా చదవండి..
మోచా తుఫాన్: ఆంధ్రప్రదేశ్ కు పొంచివున్న పెను తుఫాన్..
వీలైనంత త్వరగా పంట నష్టం గణనను పూర్తి చేయాలి అని అధికారులను సవివరమైన నివేదిక అందజేసారు. పంట నష్టపోయిన రైతుల జాబితాలను గ్రామ సచివాలయాల వద్ద ప్రముఖంగా ప్రదర్శించాలని, సామాజిక తనిఖీ కూడా నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు.
ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. రైతులను ఆర్ధికంగా ఆదుకోవడానికి వారికీ వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేస్తుంది. అలాగే రైతులకు నాణ్యమైన విత్తనాలు మరియు ఎరువులను ఆర్బికే ల ద్వారా రైతులకు పంపిణి చేస్తుంది. అయితే ఈ రైతు భరోసా డబ్బులను త్వరలో రైతుల ఖాతాల్లో జమచేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ఎవరైనా రైతులకు ఈ పథకానికి అర్హత ఉండి వారికి డబ్బులు అందకపోతే లేదా కొత్తగా పొలం పాస్ బుక్ చేయించుకున్న దానికి సంబంధించిన పత్రాలు తీసుకోని వెంటనే రైతు భరోసా పథకంకు అప్లై చేసుకోండి. ఒకవేళ రైతులు తమ భూమికి కొత్త పాస్ బుక్ పొందితే, దానికి ఆధార్ లింక్ కచ్చితంగా చేయించుకోండి.
ఇది కూడా చదవండి..
Share your comments