పోయిన నెల ఇండియాలో ప్రముఖ మసాలా ఉత్పత్తులను, సింగపూర్ సహా మరికొన్ని దేశాలు బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. ఇండియా నుండి ఎగుమతి చేసుకున్న మసాలా ఉత్పత్తుల్లో క్యాన్సర్ కారకమైన, పురుగుమందులు ఉండటం వలన సింగపూర్ ప్రభుత్వం ఈ బ్యాన్ విధించింది. ఇందుకు గాను ఎవరెస్ట్, ఎండిహెచ్ మసాలా ఉత్పత్తులు దిగుమతి చెయ్యడం కానీ, వాటిని విక్రయించడం కానీ ఉండకూడదని సింగపూర్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసి. దీనికంటే ముందే అమెరికా లో కూడా కొన్ని భారతియా ఆహార ఉత్పత్తుల మీద నిషేధం విధించడం, జరిగింది. ఈ సంఘటనల తర్వాత మనం తీసుకునే ఆహారం ఆరోగ్యానికి మంచిదా? కాదా? అన్న సందేహాలు ఎక్కువయ్యాయి.
మన దేశంలో ఉన్న అన్ని ఆహార ఉత్పత్తి సంస్థలు, ఎఫ్ఎస్ఎస్ఏఐ , పరిమితి పొందగానే తమ ఉత్పత్తులను మార్కెట్లో విక్రయించగలవు. ఫుడ్ సాఫ్ట్య్ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు రూపొందించిన మార్గదర్శకాలను అనుసరిస్తూ ఆహారం ఉత్పత్తిచేసే వారికి మాత్రమే వీరి నుండి లైసెన్స్ లభిస్తుంది. ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆడిటింగ్ నిర్వహించే సమయంలో ఏదైనా తప్పుగా ఉన్న లేదా నిభందణలకు విరుద్ధంగా ఉన్నా, అటువంటి సంస్థల లైసెన్స్ రద్దు చెయ్యబడుతుంది. భారత దేశంలో తయారయ్యే ఆహార ఉత్పత్తులన్నిటికి ఈ నిబంధన వర్తిస్తుంది.
పోయిన నెల సింగపూరే ప్రభుత్యం తమ దేశంలో కొన్ని ప్రముఖ భారతియా మసాలా బ్రాండ్ల విక్రయాన్ని నిషేధించింది. ఎవరెస్ట్ మరియు ఎండిహెచ్ మాసాలల్లో పరిమితికంటే ఎక్కువ పురుగుమందుల శాతం ఉండటం వలన సింగపూర్ ప్రభుత్వం ఈ మసాలా కంపెనీలను బ్యాన్ చేసినట్లు తెల్సుతుంది. ఎఫ్ఎస్ఎస్ఏఐ, ఈ మసాలా కంపెనీలకు నిర్దిష్ట పరిమాణంకంటే 10 శాతం ఎక్కువ పురుగుమందుల అవేశేషాలు కలిపేందుకు ఎఫ్ఎస్ఎస్ఏఐ అనుమతించిందని కొన్ని సమాచార మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి
ఎఫ్ఎస్ఎస్ఏఐ దీనిని ఖండిస్తూ, ఇండియాలో కఠినమైన ఆహారం నియమాలను ఆచరిస్తున్నట్లు, ప్రజలు ఆహార భద్రతను దృష్టిలో ఉంచుకొని, నిభందనలు అతిక్రమిస్తున్న కంపినీల మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ పొందడానికి వారు సూచించిన భద్రత నాణ్యతలు అన్ని పాటించాలి, లేదంటే అటువంటి ఆహార ఉత్పతులకు లైసెన్స్ లభించదు.
ప్రస్తుతం దేశంలో పంటలు పండించడానికి పురుగుమందులు వినియోగిస్తున్నారు కనుక, పురుగుమందుల అవశేషాలు లేని ఆహారం లభించడం కష్టం. ఇందుకుగాను మనం తినే ఆహార పదార్ధాల్లో 'మాక్సిమం రెసిడ్యుఅల్ లిమిట్'(MRL) ఆధారంగా పురుగుమందుల అవశేషాలు ఉండేందుకు అనుమతి ఉంది. ధాన్యానికి ఒక కేజీకి 0.03 మిల్లీగ్రాముల వరకు రసాయన అవశేషాలు ఉండొచ్చు. అదేవిధంగా మసాలా ఉత్పత్తులకు ఈ పరిమితి ఒక కేజీకి 0.1- 80 మిల్లీగ్రాముల పురుగుమందుల అవశేషాలు ఉండేందుకు వీలుంటుంది. ఈ పరిమితి కి మించి ఏమైనా ఆహార పదార్ధాలు ఉంటే వాటి మీద ఎఫ్ఎస్ఎస్ఏఐ కఠిన చర్యలు చేపడుతుంది. సింగపూర్ దేశంలో ఫుడ్ సాఫ్ట్య్ నిబంధనలు, ఇక్కడి నిబంధనలో తేడా ఉండటం మూలాన, అక్కడి ప్రభుత్యం ఈ మసాలా ఉత్పత్తులను నిషేధించినట్లు తెల్సుతుంది.
Share your comments