News

వన్యప్రాణి సంరక్షణ మరియు స్థిరమైన జీవవైవిధ్య వినియోగంపై అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసిన భారతదేశం-నమీబియా

Srikanth B
Srikanth B
India-Namibia sign MoU on wildlife conservation and sustainable use of biodiversity
India-Namibia sign MoU on wildlife conservation and sustainable use of biodiversity

వన్యప్రాణి సంరక్షణ మరియు స్థిరమైన జీవ వైవిధ్య వినియోగంపై భారతదేశ ప్రభుత్వం మరియు రిపబ్లిక్ ఆఫ్ నమీబియా ప్రభుత్వం ఈ రోజు ఒక అవగాహన ఒప్పందం ( MoU ) పై సంతకాలు చేశాయి. భారతదేశంలో చారిత్రక చిరుత జాతి పూర్వ స్థాయికి చేరుకునేలా చూసేందుకు ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాలు కృషి చేస్తాయి. పరస్పర గౌరవం, సార్వభౌమాధికారం, సమానత్వం మరియు భారతదేశం మరియు నమీబియా దేశాలకు ప్రయోజనం కలిగే విధంగా వన్యప్రాణుల సంరక్షణ మరియు స్థిరమైన జీవవైవిధ్య వినియోగాన్ని ప్రోత్సహించడానికి MoU దోహదపడుతుంది.

MOU లో ప్రాధాన్యతా క్రమంపై అమలు జరిగే ప్రధాన అంశాలు:

అంతరించిపోతున్న చిరుతలను సంరక్షించి గతంలో సంచరించిన ప్రాంతాల్లో సంచరించే విధంగా చర్యలు అమలు చేస్తూ చిరుతల సంరక్షణ మరియు పునరుద్ధరణ అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేక దృష్టితో జీవవైవిధ్య పరిరక్షణ,
• రెండు దేశాలలో చిరుత సంరక్షణను ప్రోత్సహించే లక్ష్యంతో నైపుణ్యం మరియు సామర్థ్యం భాగస్వామ్యం మరియు మార్పిడి,
• ఉత్తమ పద్ధతులు మార్పిడి చేసుకోవడం ద్వారా వన్యప్రాణుల సంరక్షణ మరియు స్థిరమైన జీవవైవిధ్య వినియోగం సాధించడం
• సాంకేతిక అనువర్తనాలు, వన్యప్రాణుల ఆవాసాలలో నివసించే స్థానిక ప్రజలకు జీవనోపాధిని కల్పించడం, జీవవైవిధ్య పరిరక్షణకు విధానాలు అమలు చేయడం
• వాతావరణ మార్పు, పర్యావరణ పరిరక్షణ, పర్యావరణ ప్రభావ అంచనా, కాలుష్యం మరియు వ్యర్థాల నిర్వహణ మరియు పరస్పర ఆసక్తి ఉన్న ఇతర రంగాల్లో సహకారం అందించుకోవడం
• వన్యప్రాణుల నిర్వహణలో శిక్షణ మరియు విద్య కోసం సిబ్బంది మార్పిడి, సంబంధిత అంశాల్లో సాంకేతిక నైపుణ్యాన్ని పంచుకోవడం.

మరిన్ని చదవండి .

Drone in Agriculture :డ్రోన్ ల తో పిచికారీ చేసే 477 రకాల పురుగుమందులకు ప్రభుత్వం ఆమోదం !

భారతదేశంలో చిరుత పునరుద్ధరణ కార్యక్రమానికి అవసరమైన ఆర్థిక మరియు పరిపాలనా సహకారాన్ని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ద్వారా కేంద్ర పర్యావరణ, అటవీ, పర్యావరణ మార్పుల మంత్రిత్వ శాఖ సమకూరుస్తుంది.కార్పొరేట్ల సామాజిక బాధ్యత(సీఎస్సార్‌) ద్వారా ప్రభుత్వం, కార్పొరేట్ ఏజెన్సీల భాగస్వామ్యం రాష్ట్ర మరియు కేంద్ర స్థాయిలో అదనపు నిధుల కోసం ప్రయత్నాలు జరుగుతాయి. వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యుఐఐ), జాతీయ మరియు అంతర్జాతీయ /చిరుత నిపుణులు/ఏజెన్సీలు ఈ కార్యక్రమానికి సాంకేతిక మరియు విజ్ఞాన సహాయాన్ని అందిస్తాయి.


2020లో సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా, సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ సలహాలు, సూచనలు, మార్గదర్శకాలకు లోబడి భారతదేశంలో చిరుతలు తిరిగి ప్రవేశపెట్టి అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని జాతీయ పులుల సంరక్షణ సంస్థ, కేంద్ర పర్యావరణ, అటవీ, పర్యావరణ మార్పుల మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తున్నాయి.

Source: PIB 

మరిన్ని చదవండి .

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం... త్వరలో రైతులకు డ్రోన్లు..

 

Share your comments

Subscribe Magazine

More on News

More