News

గోధుమ ఎగుమతులను నిషేధించిన భారత్!

S Vinay
S Vinay

దేశంలో ధరల పెరుగుదలను నియంత్రించే చర్యల్లో భాగంగా భారత్ గోధుమల ఎగుమతులపై తక్షణమే నిషేధం విధించింది.

స్థానిక ధరల పెరుగుదలను అరికట్టడానికి, భారతదేశం గోధుమ ఎగుమతులను తాత్కాలికంగా నిషేధించింది . భారత దేశం ప్రపంచంలోని రెండవ అతిపెద్ద గోధుమ ఉత్పత్తిదారుగా ఉంది. ఏప్రిల్‌ మాసం లో గోధుమల ధరలు ఈ దశాబ్ద కాలంలో గరిష్ట స్థాయిని చూసింది.

దేశంలో పెరుగుతున్న నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌లను నియంత్రించడానికి కేంద్రం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. కేంద్రం ఎగుమ‌తి కోసం క్రెడిట్ లెట‌ర్ జారీ చేసే వాటికి మాత్ర‌మే షిప్పింగ్‌కు అనుమ‌తి ఉంటుంద‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆహార కొర‌త ఏర్పడిన విషయం తెలిసినదే.

ఏప్రిల్‌లో దాదాపు ఎనిమిదేళ్లలో రిటైల్ ఆహార ద్రవ్యోల్బణం గరిష్టంగా 8.38 శాతానికి చేరడం వలన కేంద్ర ప్రభుత్వం దేశం నుండి అన్ని గోధుమల ఎగుమతిపై నిషేధం విధించింది.

ఇకపై రెండు రకాల షిప్‌మెంట్‌లు అనుమతించబడతాయి. మొదటిది "భారత ప్రభుత్వం ఇతర దేశాలకు వారి ఆహార భద్రత అవసరాలను తీర్చడానికి మరియు వారి ప్రభుత్వాల అభ్యర్థన ఆధారంగా మంజూరు చేసిన అనుమతి ఆధారంగా అని వాణిజ్య నోటిఫికేషన్ విభాగం పేర్కొంది.

చాలా వరకు ప్రపంచ దేశాలు గోధుమల కొరకై ఉక్రెయిన్ దేశం పై ఆధార పడి ఉన్నాయి. అయితే ఉక్రెయిన్ నుంచి ప్రపంచ‌దేశాల‌కు వెళ్లాల్సిన గోధుమలను ర‌ష్యా అడ్డుకుంటున్న సంగతి విదితమే. కారణంగా అనేక దేశాల‌కు గోధుల స‌ర‌ఫ‌రా ఆగిపోయింది. ఫ‌లితంగా ఆయా దేశాల్లో ఆహార సంక్షోభం ఏర్పడింది.

అందుతున్న సమాచారం మేరకు దేశంలోని చాలా ప్రాంతాలలో గోధుమ రైతులు గత సంవత్సరంతో పోలిస్తే 15-20 శాతం తక్కువ ధాన్యాన్ని పండించారని తెలుస్తుంది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 4.5 మిలియన్ టన్నుల ఎగుమతులపై ఇప్పటికే భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. అందులో 1.5 మిలియన్ టన్నులు ఏప్రిల్‌లో రవాణా చేయబడ్డాయి.

మరిన్ని చదవండి

టమాటా లో గల ముఖ్యమైన మరియు అధిక దిగుబడినిచ్చే రకాలను తెలుసుకోండి!

Share your comments

Subscribe Magazine

More on News

More