News

పాల ఉత్పత్తిలో నంబర్‌వన్‌గా ఉన్న ఇండియా.. ఇక విదేశాల నుండి దిగుమతులు తప్పవా?

Gokavarapu siva
Gokavarapu siva

మన భారతదేశం ప్రపంచంలోనే పాల ఉత్పత్తుల్లో మొదటి స్థానంలో నిలిచింది. ఇందుకు కారణం 1970లో జరిగిన శ్వేత విప్లవం. ఈ శ్వేత విప్లవం ద్వారా దేశంలో పాల ఉత్పత్తులు అసాధారణంగా పెరిగాయి. దీనితో లక్షలాది మంది పాడి రైతుల ఆదాయం పెరిగింది. పాడి పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందింది. రోజుకు 50 కోట్ల లీటర్లకుపైగా పాలు ఉత్పత్తి చేస్తూ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. దేశంలో ప్రతి ఇంటికి పాలు మరియు పాల ఉత్పత్తులు చేరాయి.

ప్రస్తుతం ఈ పాడి పరిశ్రమలపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతుంది. దీనివలన దేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలతో పాటు దాణా ధరలు కూడా ఒక్కసారిగా పెరిగిపోయాయి. వీటితోపాటు నేడు పసువులను లంపీ స్కిన్‌ వ్యాధి వేధిస్తుంది. ఈ వ్యాధిని అరికట్టడంలో కూడా ప్రభుత్వ యాంత్రాంగం విఫలమైంది. ఈ సమయంలో పాల ఉత్పత్తుల డిమాండ్ పెరగడంతో ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. దేశంలో పాలు తగ్గడంతో విదేశాల నుండి పాలపొడి, వెన్న, నెయ్యి, చీజ్‌ వంటి సరుకులను దిగుమతి చేసుకొనే పరిస్థితికి వచ్చం.

దేశంలో ప్రతి సంవత్సరం పాలు మరియు పాల ఉత్పత్తులకు 10 శాతం డిమాండ్ పెరుగుతుంది. సాధారణంగానే బియ్యం మరియు పప్పు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వీటితోపాటు పాల ధరలు కూడా పెరగడంతో పేద మరియు మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి దారుణంగా తయారయింది. వెన్న, నెయ్యి, పాలపొడి వంటి ఉత్పత్తులు మరికొద్ది నెలల్లో దుకాణాల్లో దొరక్కపోవచ్చని డెయిరీ పరిశ్రమ వర్గాల ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.

ఇది కూడా చదవండి..

కిలో రేషన్ బియ్యం రూ.10.. రైస్ మిల్లులకు తరలింపు

దేశంలో కేవలం ఒక సంవత్సరం కాలంలోనే ఎన్నడూ లేని విధంగా పాల ఉత్పత్తుల ధరలు ఏకంగా 12-15 శాతం వరకు పెరిగాయి. దీనికి కారణం పశువుల ఎదుగుదలకు అవసరమైన ధరలు కూడా భారీగా పెరగడమే అని తెలుస్తుంది. రైతులకు వచ్చే ఆదాయంలో సుమారుగా 70 నుండి 80 శాతం వరకు పశువుల దాణాలకే ఖర్చు పెట్టాల్సి వస్తుందని రైతులు భాదపడుతున్నారు.

లంపీ స్కిన్‌ వ్యాధి కారణంగా ఉత్తరాది రాష్ట్రాల్లో సుమారుగా 1,89,000 పాడి పశువులు మరణించాయని కేంద్ర డయారి శాఖ తెల్పింది. గత సంవత్సరంలో దేశంలో ఒక లిటర్ టోన్డ్ మిల్క్ ధర వచ్చేసి రూ.48 ఉన్నాయి. ఈ ధర 2023 సంవత్సరానికి రూ.56- 59 వరకు పెరిగింది. ఒక సంవత్సరం కాలంలోనే సుమారుగా 10 రూపాయల వరకు పెరిగింది.

బుధవారం కేంద్ర పశుసంవర్ధక, డెయిరీ శాఖ కార్యదర్శి అయిన రాజేశ్‌కుమార్‌ సింగ్ వెన్న, నెయ్యి, పాలపొడి వంటి పాల ఉత్పత్తులను విదేశాల నుండి దిగుమతుల కొరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి..

కిలో రేషన్ బియ్యం రూ.10.. రైస్ మిల్లులకు తరలింపు

Share your comments

Subscribe Magazine