ఫోన్ పే, మరోయు గూగుల్ పే వంటి ఆన్లైన్ పేమెంట్ అప్స్ వచ్చాక, నగదు లావాదేవీలు చాల సులభతరం అయ్యాయి. కొనుగోలుచేసి వస్తువు ఎంత పెద్దదైన, చిన్నదైనా సరే యూపీఐ ద్వారా నగదు చెల్లించేందుకు, ప్రజలు మొగ్గుచూపుతున్నారు. ఆన్లైన్ లో షాపింగ్ దగ్గర నుండి, నెలవారీ బిల్స్ చెల్లించడం వరకు అన్ని చేతిలోనే అయిపోతున్నాయి. యూపీఐ ప్రెమెంట్స్ ఎక్కువయ్యాక, డిజిటల్ కరెన్సీకి ప్రాధాన్యత పెరిగి, కరెన్సీ నోట్లకు డిమాండ్ తగ్గింది.
అయితే అన్ని చోట్ల నగదు రహితంగా, డిజిటల్ పేమెంట్ చెయ్యడం సాధ్యం కాదు. కొన్ని సమయాల్లో బ్యాంకు సర్వర్లు పనిచేయక డబ్బు చెల్లించడానికి ప్రజలు పడే ఇబ్బందులు గమనిస్తూనే ఉంటాం. ఇటువంటి సమస్యలు తలెత్తకుండా డబ్బును వెంట ఉంచుకోవడం ఉత్తమం.
సాధారణంగా డబ్బును బ్యాంకుల, నుండి లేదా ఎటిఎం ల నుండి డ్రా చేసుకుంటాం. అయితే అన్ని చోట్ల బ్యాంకులు లేదా ఏటీఎంలు ఉంటాయన్న గ్యారంటీ లేదు అటువంటి సమయాల్లో, సమయాల్లో ఇండియన్ పోస్ట్ పెమెంట్స్ బ్యాంకు ఇంటి వద్దకే ఎటిఎం సేవలను అందిస్తుంది. ఇండియన్ పోస్టల్ సర్వీసెస్ ఈ సేవలను ఎప్పటినుండో అందిస్తున్న, చాల మందికి ఈ విష్యం తెలీదు. ప్రజలకు ఈ సేవలను గురించి తెలియచెయ్యడం ఎంతో కీలకం. ఏటీఎంలు, మరియు బ్యాంకు సౌకర్యం లేని ఎన్నో గ్రామాల ప్రజలు పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న ఈ సేవ ద్వారా డబ్బులు ఇంటివద్దే పొందవచ్చు.
ఆన్లైన్ ఆధార్ ఎటిఎం ఉపయోగించి ప్రజలు ఇంటి వద్ద నుండే సులభంగా డబ్బును పొందవచ్చు. ఆధార్ నెంబర్ కు లింక్ చెయ్యబడిన బ్యాంకు ఖాతా నుండి బయోమెట్రిక్ సహాయంతో డబ్బును పొందవచ్చు. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టం(AePS) విధానం ద్వారా, బయోమెట్రిక్ అథేన్తికేషన్ ద్వారా ఈ లావాదేవీలు జరుగుతాయి. అత్యవసర సమయాల్లో డబ్బు అవసరమున్నపుడు, మరియు బ్యాంకుకు కానీ, ఎటిఎం కు కానీ వెళ్లే సమయం లేనప్పుడు, IPB ఆన్లైన్ ఎటిఎం ద్వారా మీ ఇంటి వద్ద నుండే డబ్బును పొందవచ్చు.
Share your comments