News

సన్ఫ్లవర్ పంట మొత్తం కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వానిదే- హరీష్ రావు

KJ Staff
KJ Staff

బిఆర్ఎస్ లీడర్, హరీష్ రావు, ప్రొద్దుతిరుగుడు పంట మొత్తం ఎంఎస్పి ధరకే కొనుగోలు చేసి, రైతులను నష్టాల పాలుకాకుండా చూడాలని ప్రభుత్వాని కోరారు. సన్ ఫ్లవర్ కొనుగోలులో కేంద్రం విధించిన, పరిమితి ద్వారా ఎంతో మంది రైతులు నష్టపోయే అవకాశం ఉన్నట్లు ఆయన్ని తెలిపారు తమ ప్రభుత్వం హయాములో, మొత్తం పంటను కొనుగలో చేసినట్లు గుర్తు చేసారు.


ప్రస్తుతం తెలంగాణలోని మెదక్, నిజామాబాదు జిల్లాల్లో మొత్తం 21 వేల ఎకరాల్లో సన్ ఫ్లవర్ సాగు చేస్తున్నారు, నీటి లభ్యత మరియు వాతావరణం అనుకూలించడంతో ఈ ఏడాది 1,65,800 క్విన్టల దిగుబడి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం నిధుల లభ్యత దృష్ట్యా కేవలం 22.5% మాత్రమే కొనుగోలు చేస్తున్నట్లు తెలిపింది. మిగిలిన రైతులు తమ పంటలు విక్రయించుకోవడానికి ఎంఎస్పి కంటే తక్కువ ధరకు మార్కెట్లో అమ్ముతున్నట్లు హరీష్ రావు తెలిపారు. ఈ పరిస్థితిని నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి మిగిలిన పంట మొత్తని ఎంఎస్పి ధరకు కొనుగోలు చేయవల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ని కోరారు.

ప్రస్తుతం సన్ ఫ్లవర్ ఎంఎస్పి ప్రకారం ఒక ధర 6,760 రూపాయలుగా ఉంది. దిగుబడి మొత్తంలో కేంద్ర ప్రభుత్వం కేవలం 22.5% మాత్రమే కొనుగోలు చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే, రైతులు తమ పంటను మార్కెట్లో తక్కువ ధరకే విక్రయించే పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం సన్ ఫ్లవర్ పంటకు మార్కెట్లో ధర ఒక క్విన్టకు 4000-5000 రూపాయిల వరకు. ఈ ధరకు అమ్మితే గిట్టుబాటు కాక రైతులు నష్టపోయే అవకాశం ఉంది. గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు కొనుగోలు కేంద్రాల ద్వారా పంట మొత్తం కోనుగోలు చేసి కనీస మద్దత్తు ధర ఇచ్చినట్లు గుర్తుచేశారు, ఇప్పుడు ఆ బాధ్యత అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేపట్టాలని కోరారు.

Share your comments

Subscribe Magazine