గ్రామాల్లోని సన్న, చిన్నకారు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న సమీకృత వ్యవసాయ
(మిశ్రమ వ్యవసాయం) పద్ధతిని ప్రోత్సహించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు వారికి అవగాహన కార్యక్రమాలను నిర్వహించి రైతులను సమీకృత వ్యవసాయం చేయడానికి ప్రోత్సహిస్తున్నారు.ఇప్పటికే గోదావరి జిల్లాల రైతులు సమీకృత వ్యవసాయ విధానాలను అనుసరించి ఏడాది పొడవునా ప్రతినెలా ఆదాయం ఆర్జిస్తూ తమ జీవన ప్రమాణాలను మెరుగుపర్చుకుంటున్నారు.
సమీకృత వ్యవసాయంలో రైతుసొదరులు తమ
కున్న భూమిని భాగాలుగా విభజించి ఎకరం విస్తీర్ణంలో వరి, చిరు ధాన్యాలు, పప్పు, నూనె గింజలు సాగు చేస్తూ కుటుంబానికి ఆహార భద్రత కల్పించుకుంటున్నారు.అర ఎకరంలో ఉద్యాన పంటలైన మామిడి, జామ, బత్తాయి అల్లనేరేడు, కొబ్బరి వంటి పంటలను సాగు చేస్తు వాటిలో అంతర పంటలుగా నిత్య అవసరాలైన కూరగాయలు, ఆకు కూరలు, పూల సాగు వంటివి చేస్తూ సంవత్సరం పొడవునా ఆదాయాన్ని పొందుతున్నారు.
ఇంకొంత భాగంలో బహుళ వార్షిక గడ్డిజాతి మొక్కలు,పప్పుజాతి పశు గ్రాసాలు సాగు చేసుకొని వ్యవసాయ అనుబంధ రంగాలైన కోళ్ల పెంపకం, గొర్రెల పెంపకం, పాడి పరిశ్రమ, వర్మీ కంపోస్ట్, తేనెటీగల పెంపకం వంటివి ఏర్పాటు చేసుకొని అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. ఇలా కొద్దిపాటి భూమిలోనే అందుబాటులో ఉన్న సహజ వనరులను ప్రణాళికాబద్ధంగా వినియోగించుకుంటూ సమీకృత వ్యవసాయాన్ని చేపట్టడానికి రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు.
Share your comments