News

ఈనెల 30న ఇంటర్మీడిట్ సప్లిమెంటరీ ఫలితాలు..

Srikanth B
Srikanth B

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు ఈనెల 30వ తేదీన వెల్లడికానున్నాయి మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి అయితే దీనిపై ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

 

గోదావరి ఉగ్రరూపంతో జులై, ఆగష్టుల్లో రెండుసార్లు గోదావరి పరివాహక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో ఆగష్టు రెండో వారంలో వచ్చిన వరదల్లో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు, వీఆర్‌ పురం మండలాల్లో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఆగష్టు 10న నిర్వహించాల్సిన పరీక్షను వరదల కారణంగా నిర్వహించలేకపోయారు.

ఫలితాలను ఒక సరి విడుదల చేసిన తరువాత ఫలితాలు ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్ సైట్ bie.ap.gov.in లో పొందవచ్చు. లేదా ఇక్కడ క్లిక్ చేసి నేరుగా ఇంటర్మీడియట్ బోర్డు వెబ్ సైట్ లోకి వెళ్లవచ్చు. అధికారిక వెబ్ సైట్ లో ఫలితాలు అనే ఆప్షన్ క్లిక్ చేసి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ రిజల్ట్స్ 2022 ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆతర్వాత హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి రిజల్ట్ బటన్ పై క్లిక్ చేస్తే ఫలితాలు డిస్ ప్టే అవుతాయి. మరోవైపు గోదావరి వరదల్లో ముంపునకు గురై సప్లిమెంటరీ పరీక్షలు రాయలేకపోయిన విద్యార్ధులకు ఇంటర్మీడియట్ బోర్డు తీపి కబురు అందించింది. పరీక్ష రాయలేకపోయినా విద్యార్థులను పాస్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

వన్ నేషన్ వన్ ఫెర్టిలైజర్: “భారత్ బ్రాండ్” పేరుతో ఎరువులు విక్రయించాలని కేంద్రం నోటీసు!

దీంతో ఆ రోజు జరగాల్సిన పరీక్షకు హాజరు కావాల్సిన విద్యార్ధులు అందర్నీ పాస్ చేయాలని ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించింది.
వరదల కారణంగా పరీక్షలు రాయలేకపోయిన వారందర్ని ఉత్తీర్ణులుగా ప్రకటించనున్నారు. డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభం కావడం, ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ మొదలవడంతో మరో రెండు రోజుల్లో అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ పరీక్షా ఫలితాలను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేయనుంది.

వన్ నేషన్ వన్ ఫెర్టిలైజర్: “భారత్ బ్రాండ్” పేరుతో ఎరువులు విక్రయించాలని కేంద్రం నోటీసు!

Share your comments

Subscribe Magazine