వ్యవసాయంలో విత్తనానికి విశేషమైన స్థానం ఉంది. ఒక పంట ప్రారంభించడానికి ప్రధానమైనది విత్తనం. విత్తనం యొక్క నాణ్యత మీదే పంట దిగుబడి ఆధారపడి ఉంటుంది. వ్యవసాయంలో విత్తనానికి ఉన్న ప్రాముఖ్యతను తెలియచెయ్యడనికి ప్రతీ సంవత్సరం ఏప్రిల్ 26 న అంతర్జాతీయ విత్తన(సీడ్ డే ) దినోత్సవంగా జరుపుకుంటారు. అంతేకాకుండా సేంద్రియ ఆహారం లభ్యత, రైతుల హక్కులు గురించి తెలియచేసేందుకు ఈ రోజు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
వ్యవసాయం ద్వారా జరుగుతున్న పర్యావరణ నష్టాన్ని తగ్గించి, పెరుగుతున్నజనాభా ఆకలి తీర్చే విధంగా వ్యవసాయాన్ని సమీకరించవల్సిన అవసరం ఉంది. సుస్థిరవ్యవసాయ పద్దతులను అలవర్చుకోవడం ద్వారా పర్యావరణ హితంగా వ్యవసాయ కొనసాగడమే కాకుండా, ప్రపంచ జనాభా ఆహార అవసరాలను కూడా తీర్చేందుకు వీలుంటుంది. అంతర్జాతీయ విత్తన దినోత్సవాన్ని పురస్కరించునుకుని ఈ రోజు రైతులకు సుస్థిర వ్యవసాయ పద్దతుల గురించి తెలియచేస్తారు.
ఈ మధ్యకాలంలో వాతావరణంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి, వాతావరణం అనుకూలించక పంట దిగుబడి ఘనీయంగా తగ్గుతూ వస్తుంది. ఈ పరిస్థితిని నియంత్రించి పంట దిగుబడులు పెంచడానికి మేలైన రకం మొక్కల్ని అభివృద్ధి చెయ్యవలసి ఉంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో మొక్కలను అభివృధి చేసి దిగుబడి పెంచే విధంగా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఇలా అభివృద్ధి చేసిన మేలైన రకాలను రైతుల వరకు చేర్చడానికి విత్తనాలే మూలం. కొత్త రకం విత్తనాలు రైతులకు అందుబాటులోకి వచ్చేముందు వాటిని ఎన్నో విధాలుగా పరీక్షించి తర్వాతే వాటిని మార్కెట్లో విక్రయిస్తారు. ప్రపంచవ్యాప్తంగా విత్తనాలు పంపిణి సాగవుగా జరగదని CARDI వంటి సంస్థలు నిరంతరం పరిశీలిస్తాయి. మేలైన విత్తనాలు రకాలు రైతుల వద్దకు చేర్చి రైతుల ఆదాయాన్ని పెంచడంలో సహాయపడుతున్నాయి.
Share your comments