News

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అవకతవకలు.. 5 కోట్ల జాబ్ కార్డులు రద్దు

Gokavarapu siva
Gokavarapu siva

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనతో పాటు, ఎక్కువగా అవకతవకలు ఎదుర్కొంటున్న మరో ప్రభుత్వ పథకం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MNREGA). దేశంలోని చాలా మంది ప్రజలు ఈ పథకానికి నకిలీ జాబికార్డులను తయారు చేసుకుని ఈ పథకం ప్రయోజనాలను పొందుతున్నారు. అయితే ప్రస్తుతం అలాంటివారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని, ఈ ఎంఎన్‌ఆర్‌ఈజీఏ పథకానికి చెందిన 5 కోట్లకు పైగా జాబ్ కార్డులను రద్దు చేసింది.

మునుపటి సంవత్సరాలతో పోల్చితే నకిలీ MNREGA జాబ్ కార్డ్‌ల సంఖ్య గణనీయంగా పెరిగాయని ప్రభుత్వం తెలిపింది. నివేదికల ప్రకారం, గత ఆర్థిక సంవత్సరం 2021-22తో పోలిస్తే 2022-23 ఆర్థిక సంవత్సరంలో మోసపూరిత జాబ్ కార్డ్‌లను కలిగి ఉన్న వ్యక్తుల సంఖ్య 247 శాతం పెరిగింది. దీంతో ప్రభుత్వంపై అనవసరంగా ఆర్థిక భారం పెరిగిపోయింది. దీంతో కేంద్ర ప్రభుత్వం దాదాపు 5 కోట్లకు పైగా జాబ్ కార్డులను రద్దు చేయాల్సి వచ్చింది.

ఇటీవలి ప్రకటనలో, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ MNREGA పథకంలో ఎక్కువగా జరుగుతున్న అక్రమాలను ప్రస్తావించారు. ఈ నకిలీ జాబ్ కార్డులను ఎక్కువ మంది ప్రజలు తయారు చేసుకున్నారు. మరొకవైపు ఈ పథకంలో చేరిన చాలా మంది లబ్ధిదారులు కుఆ మృతి చెందారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకంలోని నకిలీ జాబ్ కార్డ్ హోల్డర్‌లతో పాటు చనిపోయిన లబ్ధిదారుల పేర్లతో మొత్తం 5,1891168 జాబ్ కార్డులను లబ్ధిదారుల లిస్ట్ నుండి తొలగించారు. గత సంవత్సరంలో ఈ సంఖ్య అనేది 1,4951247గా ఉంది. ప్రధానంగా పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఈ జాబ్ కార్డులు చాలా వరకు రద్దు చేయబడ్డాయి.

ఇది కూడా చదవండి..

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే శుభవార్త చెప్పనున్న ప్రభుత్వం..

ఆంధ్రప్రదేశ్‌లో 2021-22 ఆర్థిక సంవత్సరంలో, ఈ రాష్ట్రంలో మొత్తం 625,514 జాబ్ కార్డ్‌లు పథకం జాబితా నుండి తొలగించబడ్డాయి. కానీ ఈ ఏడాది దాని సంఖ్య 7805569కి పెరిగింది. అంటే 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లో 7805569 జాబ్‌ కార్డులు రద్దు చేయబడ్డాయి. మరొకవైపు అదేవిధంగా 2021-22 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో 61278 జాబ్ కార్డులు రద్దు చేయగా, 2022-23లో వాటి సంఖ్య 17,32,936కి పెరిగింది.

సంపన్న రాష్ట్రమైన గుజరాత్‌లో కూడా మోసపూరిత కార్డుల ఉనికి చాలా ఎక్కువైంది. 2021-22 సంవత్సరంలో, మొత్తం 1,43,202 జాబ్ కార్డులు రద్దు చేయబడ్డాయి, అయితే 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 4,30,404కి పెరిగింది.

ఇది కూడా చదవండి..

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే శుభవార్త చెప్పనున్న ప్రభుత్వం..

Related Topics

MGNREGA

Share your comments

Subscribe Magazine