News

రైతుల ఖాతాల్లో జమ కాకుండా రుణమాఫీ సొమ్ము వెనక్కి.. కారణం ఇదే?

Gokavarapu siva
Gokavarapu siva

తెలంగాణ ప్రభుత్వం అమలు రుణమాఫీ నగదు రైతుల ఖాతాల్లో జమ కాకపోవడంతో రైతులు అందులోనే చెందుతున్నారు. ఈ డబ్బులు వారి ఖాతాల్లో జమ కాకుండా తిరిగి వెన్నకి వస్తున్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ రైతుల రుణాల బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ అయిపోవడం లేదా ప్రస్తుతం డిఫాల్ట్‌గా ఉండడంతో డబ్బులు వారి ఖాతాల్లో పడకుండా వెనక్కి వస్తున్నట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు.

దీంతో పలువురు రైతులు ఈ విషయంపై వ్యవసాయ శాఖకు ఫిర్యాదు చేశారు. సుమారుగా రైతుల ఖాతాల్లో జమ కావాల్సిన రూ.50 కోట్లు ప్రభుత్వ ఖాతాకు తిరిగి చేరినట్లు వ్యవసాయశాఖ వర్గాలు వెల్లడించాయి. ప్రతి సంవత్సరం, రాష్ట్రంలో సుమారు 42 లక్షల మంది రైతులు వ్యవసాయాన్ని చేయడానికి వివిధ బ్యాంకుల నుండి రుణాలను తీసుకుంటారు. రుణం తీసుకున్న రైతులు మూడు సీజన్లలోగా బకాయిలు చెల్లిస్తేనే, తదుపరి రుణం తీసుకోవడానికి అర్హులవుతారు. ప్రభుత్వం రుణమాఫీ ప్రకటన చేయడంతో రైతులు తమ బకాయిలను మాఫీ చేస్తారని భావించి వాటిని తీర్చకుండా నిర్లక్ష్యం చేశారు.

రైతులు తమ బకాయిలను చెల్లించకపోవడంతో ప్రస్తుతం ఈ పరిస్థితి ఏర్పడింది. బీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో రైతులకు లక్ష రూపాయల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయ శాఖ ఒక విశ్లేషణ నిర్వహించి, 36.68 లక్షల మంది రైతులను కలుపుకొని రూ.19,198.38 కోట్ల రుణాలను మాఫీ చేయాల్సి ఉంటుందని వెల్లడించింది.

ఇది కూడా చదవండి..

ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డులు ఉన్నవారికి శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. అదేమిటంటే?

గత నాలుగేళ్లలో రూ.1,200 కోట్లకు పైగా ప్రభుత్వం రుణమాఫీ చేసింది. తాజాగా, వచ్చే సెప్టెంబర్ లోగా బకాయిలు కూడా మాఫీ చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు సొమ్మును విడతల వారీగా జమ చేస్తున్నారు. ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో రుణమాఫీ సొమ్ము పూర్తిస్థాయిలో విడుదల చేయకపోవడంతో అనేకమంది రైతులకు రెన్యువల్ సమస్య వచ్చి ఉంది. రెన్యువల్ చేసుకోకపోతే డిఫాల్టర్లుగా మారుతారు. అయితే చాలామంది రైతుల నుంచి రైతుబంధు సొమ్మును బ్యాంకులు గుంజుకున్నాయి. అలా రెన్యువల్ చేశాయి.

తొలిరోజు రుణమాఫీ క్రింద 167.59 కోట్ల నిధులను విడుదల చేసింది దీని ద్వారా తొలిరోజు రూ. 37 వేల నుంచి రూ. 41 వేల వరకు బకాయిలు ఉన్న 44,870 మందికి రుణమాఫీ చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఇందుకోసం రూ.237.85 కోట్లను బ్యాంకులకు చెల్లించింది.

ఇది కూడా చదవండి..

ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డులు ఉన్నవారికి శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. అదేమిటంటే?

Share your comments

Subscribe Magazine

More on News

More