News

ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డులు ఉన్నవారికి శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. అదేమిటంటే?

Gokavarapu siva
Gokavarapu siva

ఏపీ సర్కార్ ఇటీవల రేషన్ కార్డులు కలిగి ఉన్న ప్రజలకు ఒక మంచి శుభవార్త తెలిపింది. ఈ కార్డుదారులకు సెప్టెంబరు నుంచి ఫోర్టిఫైడ్ బియ్యాన్ని అందుబాటులోకి తెస్తామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ బలవర్ధక బియ్యాన్ని పంపిణీ ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS), మధ్యాహ్న భోజనం (MDM), మరియు ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ (ICDS) వంటి వివిధ పథకాల ద్వారా పంపిణీ చేయనున్నారు.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆహార పదార్ధాల కోసం రేషన్ కార్డులపై ఆధారపడే వారికి మంచి ప్రయోజనాలు ఉంటాయని భావిస్తున్నారు. ఈ బలవర్ధక బియ్యం పంపిణీ అనేది ఇప్పటికే రాష్ట్రంలో అమలవుతుంది. కానీ కొన్ని జిల్లాలకే పరిమితంగా ఉంది. ప్రభుత్వం వచ్చే సెప్టెంబర్ నెల నుండి అన్ని జిల్లాల్లో ఈ బలవర్ధక బియ్యం పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

మంత్రి కారుమూరి నాగేశ్వరరావు బలవర్ధకమైన బియ్యం యొక్క ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు, రక్తహీనతను నివారించడంలో మరియు నాడీ వ్యవస్థ యొక్క సరైన పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుందని చెప్పారు, ఎందుకంటే ఈ బియ్యంలో ఎక్కువ విటమిన్ బి 12 ఉంటుంది.

ఇది కూడా చదవండి..

తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. నేరుగా విద్యార్థుల ఖాతాల్లోకే డబ్బులు..!

రాష్ట్రంలో ఎక్కువ శాతం జనాభా రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. రక్తహీనతకు వయస్సుతో సంబంధం లేదు, పెద్దల నుండి పిల్లల వరకు అందరికి ఈ రక్తహీనత సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి మనకు బలవర్థక బియ్యం (ఫోర్టిఫైడ్ రైస్ ) అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది.

సాధారణ బియ్యంతో పోల్చుకుంటే ఈ బలవర్ధక బియ్యంలో ఎక్కువ శాతం పోషకాలు ఉంటాయి. సాధారణ బియ్యంలో ఉన్న పోషకాలు ఉడికించినప్పుడు మరియు గంజి వార్చినప్పుడు పోతాయి. కానీ మనం ఈ బలవర్ధక బియ్యాన్ని ఉడికించినప్పుడు పోషాకాలు వ్యర్థం కావని, ఒకవేళ పోషకాలు పోయిన కానీ కేవలం 10 శాతం మాత్రమే పోతుందని చెప్పారు.

ఇది కూడా చదవండి..

తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. నేరుగా విద్యార్థుల ఖాతాల్లోకే డబ్బులు..!

Related Topics

Andhra Pradesh Free ration

Share your comments

Subscribe Magazine