హమాస్ దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ గత కొన్ని నెలలుగా, గాజాలో యుద్ధం జరుపుతుంది. ఎంతో మంది ప్రాణాలు బలి తీసుకుంటున్న ఈ యుద్దని వెంటనే నిలిపివెయ్యాలని ఇప్పటికే అమెరికా వంటి అగ్రరాజ్యాలు ఇజ్రాయెల్ పై ఒత్తిడి తీసుకువస్తున్నాయి. అయినా సరే గాజా పై దాడిని ఇజ్రాయెల్ నిలపట్లేదు
ఇదే సమయంలో గాజా పౌరులకు సాయం అందించడానికి వెళ్లిన సహాయక బృందం, ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మరణించడం కలకలం రేపుతోంది. ఇజ్రాయెల్ చర్యల ద్వారా మానవతాపై సంక్షోభం ఏర్పడుతుందని, అన్ని దేశాలు మంది పడుతున్నాయి.
గాజాలోని మానవతా సాయం అందించడానికి వెళ్లిన, వరల్డ్ సెంట్రల్ కిచెన్ సిబంది ప్రయాణిస్తున్న వాహనంపై జరిగిన దాడిలో, ఆరుగురు విదేశీ సహాయకులు, భారత సంతతికి చెందిన, పాలస్తీని డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు బ్రిటన్ వాసులు కాగా, మిగిలిన వారు ఆస్ట్రేలియా, పోలాండ్, అమెరికా, కెనడా వాసులుగా గుర్తించారు. ఇజ్రాయెల్ యొక్క ఈ వికృత చర్యను ప్రశ్నించగా, ఈ దాడి లక్ష్యాన్ని గుర్తించడంలో చేసిన తప్పిదం వాళ్ళ జరిగిందని, ఈ దాడి ఉదేశ్యపూర్వకమైనది కాదని ఇజ్రాయెల్ ప్రధాని, నెతన్యాహు వివరించారు. మృతుల్లో బ్రిటన్ వాసులు ఉన్నందున, యూకే ప్రధాని రిషి సునాక్ తీవ్ర విషాదం వ్యక్తం చేసారు. గాజాలోని పరిస్థితులు రోజురోజుకు దయనీయంగా మారుతున్నాయని అయన ఆవేదన తెలిపారు. ఈ దాడిపై వీలైనంత వేగంగా, మరియు పారిదర్శకంగా విచారణ జరపాలని డిమాండ్ చేసారు.
వరల్డ్ సెంట్రల్ కిచెన్ సంస్థ, గాజా పౌరుల ఆకలి భాదలు తీర్చడానికి సముద్ర మార్గం ద్వారా కొన్ని వేల టన్నుల ఆహారాన్ని తరలిస్తోంది. తమ సిబ్బందిపై జరిగిన ఈ దాడి తర్వాత తక్షణమే తమ సహాయక చర్యలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కూడా ఈ సంఘటనపై తీవ్ర విషాదం వ్యక్తం చేసారు. యుద్ధం మధ్యలో ఆకలితో ఉన్న పౌరులకు, నిస్వార్ధంగా సేవలు అందిస్తున్న వారికి ఇలా జరగడం బాధాకరమని అయన తెలిపారు. ఏదిఏమైనప్పటికీ, గాజాలోని ఆకలితో అలమటిస్తున్న పౌరులకు అమెరికా సేవలు కొనసాగిస్తుందని బైడెన్ తెలిపారు. వారికి సహాయం చెయ్యడానికి ఉన్న అన్ని మార్గాలను వినియోగించుకుంటామని ఆయన ప్రస్తావించారు. ఇకపోతే కాల్పుల విరమణ ఒప్పందంపై, కైరోలోని ఒక బృందం పనిచేస్తుందన్నారు.
Share your comments