బాతుల పెంపకం రైతులకు లాభదాయకమైన వ్యాపారం. దీని ద్వారా రైతులు తమ ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. బాతు పెంపకం కూడా తక్కువ ఖర్చుతో కూడుకున్నది మరియు దీనికి శ్రమ పెద్దగా అవసరం లేదు.కానీ వీటి పెంపకంలో అతి పెద్ద సవాలు బాతులకు సోకే వ్యాధులను నివారించడమే.అయితే ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం దొరికింది
బాతులలో సంక్రమించే ప్లేగు వ్యాధికి భారతదేశంలో మొట్టమొదటి సారిగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను విడుదల చేశారు Indian Veterinary Research Institute కి చెందిన శాస్త్రవేత్తలు బాతుకి సోకే ప్లేగు వ్యాధిని నిరోదించే వ్యాక్సిన్‌ను భారతదేశంలో తొలిసారిగా విడుదల చేశారు. ఈ వ్యాక్సిన్ వచ్చిన తర్వాత చిన్న, సన్నకారు బాతుల రైతులకు అత్యధిక ప్రయోజనం చేకూరనుంది. . న్యూఢిల్లీలో జరిగిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (I CAR ) 93వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ వ్యాక్సిన్‌ని ప్రారంభించారు . ఈ వ్యాక్సిన్‌ను బరేలీలోని ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ( IVRI ) అభివృద్ధి చేసింది. ఈ వ్యాక్సిన్‌ను IVRIలోని ఇమ్యునాలజీ విభాగం ఇన్‌ఛార్జ్ & ప్రధాన శాస్త్రవేత్త అయిన డాక్టర్ సత్యబ్రత దండపత్ అభివృద్ధి చేశారు. ఇది ఇన్ఫెక్షన్‌ను నివారించడంలో 100 శాతం ప్రభావవంతంగా ఉన్నట్లు కనుగొనబడింది. బాతు ప్లేగు అనేది హెర్పెస్ వైరస్ వల్ల కలిగే అంటు వ్యాధి.
వ్యాక్సిన్‌ను ప్రారంభించిన తర్వాత బాతు ప్లేగు వ్యాక్సిన్ మరియు కోళ్ల రక్షణ కోసం డయాగ్నోస్టిక్ కిట్‌లను ఆదివారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర సహాయ మంత్రి ఎల్ మురుగన్ మరియు ఐసిఎఆర్ వైస్ చైర్మన్ పురుషోత్తం రూపాలా విడుదల చేశారు.
indian veterinary research institute గురించి తెలుసుకుందాం.
ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ( IVRI ) ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీలోని ఇజత్‌నగర్‌లో ఉంది .
ఇది డిసెంబర్ 9, 1889న స్థాపించబడింది.
ఇది అధునాతన సౌకర్యాలతో వెటర్నరీ మెడిసిన్ మరియు అనుబంధ శాఖల రంగంలో పరిశోధన చేస్తుంది.
మరిన్ని చదవండి.
Share your comments