News

రైతులకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్.. అక్టోబర్ లో సున్నా వడ్డీ రాయితీ!

KJ Staff
KJ Staff

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఇప్పటికే ఎన్నో పథకాలను అమలులోకి తీసుకువచ్చింది.రైతుల కోసం తక్కువ ధరకే విత్తనాలు ఎరువులను అందుబాటులో ఉంచడం కోసం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. అదేవిధంగా ఈ క్రాప్ బుకింగ్ ద్వారా పంటకి ఇన్సూరెన్స్ చేయడమే కాకుండా ప్రతి ఏడాది రైతుల తమ పొలం పనులు అవసరాల నిమిత్తం రైతు భరోసా పథకం ద్వారా 7500 రూపాయలను నేరుగా రైతుల ఖాతాలలో జమ చేయనుంది.ఈ విధంగా రైతుల కోసం ఎన్నో పథకాలను తీసుకొచ్చిన జగన్ సర్కార్ రైతులకు మరో శుభవార్త తెలిపింది.

చిన్న సన్నకారు రైతులకు పంట రుణాలపై వడ్డీ భారాన్ని తగ్గించే దిశగా అడుగులు వేస్తూ సున్నా వడ్డీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. అయితే ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా సీజన్ ముగియకుండానే సున్నా వడ్డీ రాయితీని జమ చేస్తూ రైతులకు అండగా నిలబడుతోంది.పథకం కింద ఖరీఫ్‌-2019 సీజన్‌లో 14.27 లక్షల మంది రైతులకు రూ.289.42 కోట్లు, రబీ 2019-20 సీజన్‌లో 6.28 లక్షల మందికి రూ.128.47 కోట్ల వడ్డీ రాయితీని జమ చేసింది. అదేవిధంగా ఇప్పుడు ఖరీఫ్ 2020 సీజన్ కి సంబంధించి ప్రతి రైతుకు అక్టోబర్ నెలలోనే వడ్డీ రాయితీని జమ చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

గతంలో రైతులు తీసుకున్న రుణాల పై 7 శాతం వడ్డీని బ్యాంకులు వసూలు చేయగా 3 శాతం వడ్డీ రాయితీని కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. మిగిలిన నాలుగు శాతాన్ని రైతులు బ్యాంకు చెల్లించాల్సి ఉంటుంది.అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఈ నాలుగు శాతం వడ్డీ రాయితీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది.ఈ క్రమంలోనే లక్ష వరకు పంట రుణాలు తీసుకొని ఏడాదిలోగా చెల్లించే రైతులకు మాత్రమే ఈ సున్నా వడ్డీ రాయితీ వర్తిస్తుందని తెలిపారు. రైతులు ఏ పంట పై అయితే రుణాలు తీసుకుని ఉంటారు ఆ పంటనే తప్పనిసరిగా సాగు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆ పంటకి ఈ క్రాఫ్ చేయాల్సి ఉంటుందని అధికారులు తెలియజేశారు.

Share your comments

Subscribe Magazine

More on News

More