News

11 లక్షల మంది ఖాతాల్లో డబ్బులు జమ

KJ Staff
KJ Staff

ప్రజల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా విద్యార్థుల కోసం జగనన్న వసతి దీవెన, జనగన్న విద్యాదీవెన పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. విద్యార్థుల చదవులు తల్లిదండ్రులకు భారంగా కాకుండా ఉండేందుకు జగనన్న విద్యాదీవెన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఫీజు రీయింబర్స్ మెంట్ ప్రభుత్వం అందిస్తోంది. ఈ డబ్బులను నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇక జగనన్న వసతి దీవెన పథకం కూడా విద్యార్థుల హాస్టల్ ఫీజులు చెల్లిస్తోంది.

ఈ క్రమంలో తాజాగా 2020-21 విద్యాసంవత్సరానికి సంబంధించి జగనన్న వసతి దీవెన పథకాన్ని ప్రభుత్వం అమలు చేయాలని నిర్ణయించింది. ఈ పథకం డబ్బులను ఇవాళ సీఎం వైఎస్ జగన్ నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి డబ్బులు జమ చేయనున్నారు. 11 లక్షలకు పైగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.1,147.41 కోట్లు జమ చేయనున్నారు.

ఈ పథకం ద్వారా రెండు విడతలుగా ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ పైన చదివే విద్యార్థులకు రూ.20 వేలు అందిస్తోంది. ఇక జగనన్న వసతి దీవెన పథకం కింద ఇప్పటికే రూ.1,220.99 కోట్లను ప్రభుత్వం చెల్లించింది.

మరోవైపు అమ్మఒడి పథకాన్ని కూడా ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా స్కూల్ కి పంపించే విద్యార్థుల తల్లులకు ఏడాదికి రూ.15 వేలు అందిస్తోంది. అమ్మఒడి డబ్బులు వద్దనుకునేవారికి ల్యాప్ ట్యాప్ ఇస్తామని ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

Share your comments

Subscribe Magazine