News

విమానాశ్రయం మధ్యలో వ్యవసాయం చేస్తున్న రైతు.. కారణం ఏమిటంటే?

KJ Staff
KJ Staff

వ్యవసాయం అంటే తక్కువ భావన కలిగిన ఈరోజుల్లో వ్యవసాయం మీద మమకారంతో ప్రభుత్వ ఆజ్ఞలను ధిక్కరించి నిత్యం రద్దీగా ఉండే అంతర్జాతీయ విమానాశ్రయ రన్‌వేకు కొద్ది దూరంలో తన వ్యవసాయ క్షేత్రంలో పంటలు పండించుకుని జీవనం సాగిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న ఆ రైతు కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం... జపాన్ దేశానికి చెందిన టకావో షిటో అనే రైతు విమానాశ్రయం అధికారులు అతడిని ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టినా భయపడకుండా వ్యవసాయం చేస్తూ పండ్లు, కూరగాయలు పండిస్తూ టోక్యో లోని రెస్టారెంట్స్‌కు సరఫరా మంచి పేరు తెచ్చుకున్నాడు.

అసలు ఆ రైతుకు విమానాశ్రయం పరిధిలో వ్యవసాయం చేయాల్సిన అవసరం ఏముంది అనుకుంటున్నారా. అసలు విషయానికి వస్తే జపాన్ రాజధాని టోక్యో నగరానికి సమీపంలో ఉన్న అత్యంత రద్దీ అయిన విమానాశ్రయాల్లో నరిత అంతర్జాతీయ విమానాశ్రయం ఒకటి. విమానాశ్రయాన్ని నిర్మించడానికి టోక్యో ప్రభుత్వం నరిత అనే గ్రామం సహా చుట్టుపక్కల గ్రామాల్లో వ్యవసాయ భూమిని సేకరించడానికి
1960 సంవత్సరంలో నిర్ణయించింది.

అయితే ప్రభుత్వ నిర్ణయానికి గ్రామాల్లోని చాలామంది రైతులు నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించారు.అందులో టకావో షిటో తండ్రి కూడా ఉద్యమంలో పాల్గొన్నాడు.కొంతకాలానికి చాలామంది రైతులు ప్రభుత్వం ఇచ్చిన పరిహారం తీసుకుని భూములను వదిలి వెళ్ళిపోయారు. కానీ షిటో తండ్రి మాత్రం భూమిని ప్రభుత్వానికి ఇవ్వటానికి ఒప్పుకోలేదు
దాంతో షిటో భూమిని వదిలి చుట్టు విమానాశ్రయాన్ని నిర్మించారు. దీంతో షిటో కుటుంబం అక్కడే ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నారు.చాలాసార్లు విమానాశ్రయం మేనేజ్మెంట్ వారు అతడిని ఇబ్బంది పెట్టినా భయపడకుండా తన వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయం చేసుకుంటూ ఆ దేశంలోని మంచి గుర్తింపు పొందాడు.

Share your comments

Subscribe Magazine