News

రైతులకు కేసీఆర్ మరోసారి గుడ్‌న్యూస్

KJ Staff
KJ Staff

తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ మరోసారి గుడ్‌న్యూస్ తెలిపారు. కరోనా వ్యాప్తి మళ్లీ పెరుగుతున్న క్రమంలో రైతులు పండించిన వరి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రకటించారు. ఈ మేరకు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులను కేసీఆర్ ఆదేశించారు. లాక్‌డౌన్‌లో రైతులు వేరే ప్రాంతానికి వెళ్లి తమ పంటలను విక్రయించుకునే అవకాశం లేకపోవడంతో.. ప్రభుత్వమే పంటలను కొనుగోలు చేసింది.

ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ కరోనా తీవ్రత పెరుగుతున్న క్రమంలో యాసంగిలో పండే వరి పంటను కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం గ్రామాల్లో 6,408 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. రైతులకు మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోనుంది.

ఈ మేరకు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కొనుగోలు కేంద్రాలు తక్షణమే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ సోమేష్ కుమార్‌ను కేసీఆర్ ఆదేశించారు. ఇక హైదరాబాద్‌లో ఉండి కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి కేసీఆర్ సూచించారు.

సోమవారం ప్రగతిభవన్‌లో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులతో కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యాసంగిలో 52.76 లక్షల ఎకరాల్లో వరి పంట పండిందని, దాదాపు 1 కోటి 17 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ధాన్యం, 21 లక్షల మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని కేసీఆర్ స్పష్టం చేశారు.

Share your comments

Subscribe Magazine