నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో కలిసి ప్రత్యేక విమానంలో చంఢీఘడ్‌కు వెళ్లనున్నారు.ఈ పర్యటనలో భాగంగా రైతు ఉద్యమంలో చనిపోయిన ఆరు వందల రైతు కుటుంబాలను కేసీఆర్ పరామర్శించనున్నారు
ముఖ్యమంత్రి కేసీఆర్ తన పర్యటనలో రాజకీయ, ఆర్థిక, మీడియా రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశమవ్వనున్నారు,ఈ రోజున (మే 22) చండీగఢ్‌కు వెళ్లనున్న టీఆర్ఎస్ అధినేత కేంద్రం తీసుకొచ్చిన మూడు రైతు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో చనిపోయిన 600 మంది రైతుల కుటుంబాలను ఓదార్చనున్నారు. ఆయన, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌మరియు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌లతో కలిసి మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల చెక్కును అందజేయనున్నారు.
తెలంగాణ ముఖ్య మం త్రి కె. చంద్ర శేఖర రావు శనివారం సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్తో దేశ రాజధాని ఢిల్లీ లో తన నివాసంలో సమావేశమై ప్రస్తుత జాతీయ సమస్య లపై చర్చించారు. ముఖ్యమం త్రి కేసీఆర్ రెండు రోజుల ఢిల్లీ పర్య టనలో ఉన్నారు. రాష్ట్ర పష్ట్ర తి ఎన్నిక మరియు 2024 సార్వ త్రి క ఎన్ని కలే ప్ర ధాన అజెం డాగా ఇరువురు నేతల మధ్య సమావేశం సాగింది.
తరువాత ఢిల్లీ ముఖ్య మం త్రి అరవింద్ కేజ్రీవాల్తో కలిసి శనివారం సాయం త్రం 5 గం టలకు దేశ రాజధానిలోని మొహల్లా క్లినిక్లి క్ను సందర్శించారు.ఇద్దరు ముఖ్యమంత్రులు ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలను కూడా సందర్శించారు.తరువాత దేశవ్యాప్త పర్యటనలో భాగంగా ఈ నెల 26న సీఎం కేసీఆర్ బెంగళూరులో పర్యటించనున్నారు అక్కడ భారత మాజీ ప్రధాని దేవెగౌడ మరియు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామిలను ఆయన కలుస్తారు. మరుసటి రోజున రాలేగాన్ సిద్ధికి బయలుదేరి అక్కడ ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారేను కలుస్తారు. అక్కడి నుంచి షిర్డీ వెళ్లి సాయిబాబని దర్శించుకొని తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు.
ఈ నెలాఖరున ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర రావు పశ్చిమ బెంగాల్ మరియు బీహార్ రాష్ట్రాలను కూడా సందర్శించాలని యోచిస్తున్నాడు. ఈ రెండు రాష్ట్రాల పర్యటన సందర్భంగా గాల్వాన్ లోయలో అమరులైన సైనికుల కుటుంబాలను ఆయన కలుసుకుని వారికి ఆర్థిక సహాయం అందజేయనున్నారు.
మరిన్ని చదవండి
Share your comments