బిఆర్ఎస్ అధినేత కెసిఆర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రైతులకు బాసటగా నిలిచేందుకు, పొలం బాట క్రయక్రమం నిర్వహించనున్నారు. ఏప్రిల్ 5వ తారీఖున, పొలం బాట కార్యక్రమం ద్వారా రైతుల పొలాలను సందర్శించి వారికి, భరోసా కల్పించనున్నారు. కెసిఆర్ పర్యటన, ఏర్పాట్లలో భాగంగా ఎమ్మెల్యే, గంగుల, పలువురు పార్టీ నేతలతో సమావేశమయ్యారు. అన్నదాతకు అండగా నిలిచేందుకు, కెసిఆర్ పొలం బాట పట్టరాని గంగుల తెలిపారు.
ఇటీవల కరీంనగర్ రైతులు తమ పొలాలకు నీళ్లు ఇవ్వాలని జగిత్యాల రహదారిపై బైఠాయించి తమ ఆందోళనను వ్యక్తం చేసారు. పొలాలకు సాగు నీరు లేక పంటలు అన్ని ఎండిపోతున్నాయి. పంటలు ఎండిపోకుండా, కురిక్యాల కాలువకు వరద నీటిని విడుదల చెయ్యాలని అధికారులను కోరుతున్నారు. పంటలు అన్ని చివరి దశలో ఉన్నందున వెంటనే నీటిని విడుదల చెయ్యాలని కోరారు. కాలువ నీటి మీద ఆధార పడి వ్యవసాయం చేస్తున్నామని, కాలువ నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసారు. ప్రభుత్యం వెంటనే స్పందించి నీటిని విడుదల చేయకపోతే తాము పంట నష్టపోయి పెట్టుబడి డబ్బులు కూడా రావని ఆవేదన తెలుపుతున్నారు.
వేసవి మొదట్లోనే ఎండా తీవ్రత అధికంగా ఉంది. అధిక ఉషోగ్రతలకు నీటి సమస్యలు తోడై, రైతులను తీవ్ర నష్టాల్లోకి నెడుతున్నాయి. రబీ పంట చేతికి వచ్చే సమయం ఇది, ఈ సమయంలో నీటి కొరత ఏర్పడితే రైతులు నష్టాలు చెవిచూడవల్సి ఉంటుంది.
పంట నష్టపోయిన రైతులకు భరోసా ఇచ్చేందుకు కెసిఆర్ పొలం బాట కార్యక్రమం ద్వారా ఏప్రిల్ 5 న కరీంనగర్ జిల్లాలో పర్యటించి, పొలాల వద్ద రైతులతో సంభాషించనున్నారు. ముందుగా కరీంనగర్ నియోగకవర్గంలో మొగ్ధంపూర్ గ్రామంలో పర్యటించి, రైతుల సమస్యలు తెలుసుకోనున్నారు, అనంతరం చొప్పదండి, వేములవాడ, నియోజకవర్గాల్లో ఎండిపోయిన పంటలను పరిశీలించనున్నారు. అన్నదాతలతో నేరుగా మాట్లాడి, వారికి భరోసా కల్పించనున్నారు. కరీంగనర్ జిల్లా పర్యటన అనంతరం, సిరిసిల్ల పార్టీ ఆఫిసులో కెసిఆర్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు.
Share your comments