News

చికెన్ వ్యర్థాలతో బయోడీజిల్ తయారీ.. ఎక్కడంటే?

KJ Staff
KJ Staff

సాధారణంగా మనం కోళ్లను ఆహారం కోసమే ఇప్పటివరకు ఉపయోగిస్తూ వచ్చాము. అయితే భవిష్యత్తులో ఈ కోళ్ళు మనం ఎదుర్కొంటున్న ఇంధనం కొరతను తీర్చిబోతున్నాయి. వినటానికి ఆశ్చర్యంగా ఉందా అయితే అసలు విషయానికొస్తే చికెన్ వ్యర్థాలతో బయోడీజిల్‌ను ఉత్పత్తి చేసే సరికొత్త పరిజ్ఞానాన్ని కేరళకు చెందిన పశు వైద్యుడు జాన్‌ అబ్రహం ప్రయోగాత్మకంగా ఆవిష్కరించాడు. చికెన్ వ్యర్థాలతో ఉత్పత్తి అయ్యే బయోడీజిల్ వాడకం ద్వారా కాలుష్య ప్రభావం కూడా చాలా తక్కువ స్థాయిలో ఉండటం మరొక విశేషం.

డాక్టర్‌ జాన్‌ అబ్రహం చికెన్ వ్యర్థాలతో బయో డీజిల్‌ను తయారుచేసే పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసి 2014లోనే పేటెంట్ల కోసం తమిళనాడు వెటర్నరీ అండ్‌ యానిమల్‌ సైన్సెస్‌ వర్సిటీ తరఫున అప్లై చేసుకున్నాడు. తాజాగా ఈయన అభివృద్ధి చేసిన బయో డీజిల్ టెక్నాలజీకి కేంద్ర ప్రభుత్వం పేటెంట్లు మంజూరు చేసింది. దీంతో ఆయన చేసిన కృషికి ఫలితం దక్కింది. డాక్టర్‌ జాన్‌ అబ్రహం ప్రస్తుతం కేరళలోని వయనాడ్‌ జిల్లా పుకొడ్‌ వెటర్నరీ కళాశాలలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా ఉన్నత స్థానంలో విధులు నిర్వహిస్తున్నాడు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుకొడ్‌ వెటర్నరీ కళాశాల క్యాంపస్‌లో చికెన్‌ వ్యర్థాల నుంచి బయో డీజిల్‌ తయారుచేసే ప్లాంట్‌ను ప్రయోగాత్మకంగా ఆయన ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్లో తయారయ్యే బయోడీజిల్ తో పుకొడ్‌ వెటర్నరీ కళాశాలకు చెందిన ఒక వాహనాన్ని ఇప్పటికే నడుపుతున్నామని చెప్పారు.దాదాపు 100 కేజీల చికెన్‌ వ్యర్థాల నుంచి ఒక లీటరు బయో డీజిల్‌ ఉత్పత్తి చేయవచ్చు. ఈ బయో డీజిల్ ని మార్కెట్లో లీటరుకు రూ.59 చొప్పున విక్రయించొచ్చని ఈ సందర్భంగా డాక్టర్‌ జాన్‌ అబ్రహం తెలియజేశారు.

Share your comments

Subscribe Magazine