ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు అనే చెప్పాలి. ముఖ్యమంత్రి తన పథవీకాలంలో అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలే ఆయన్ని మల్లి గెలిపిస్తాయని భావిస్తున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఫించన్ల పునరుద్దరణ కీలక ప్రకటన చేసింది. అర్హత ఉంటే కనుక వారికి మల్లి ఫించను అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
గతంలో ప్రభుత్వ పథకాల లబ్ది పొందుతున్న చాలా మంది ప్రజలను కొన్ని కారణాలతో లబ్ధిదారుల లిస్ట్ నుండి తొలగించింది. మల్లి ఇప్పుడు అలాంటి ప్రజల యొక్క అర్హతను మళ్ళి పునపరిశీలన చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఆ ప్రజలకు కనుక నిజంగా అర్హత ఉంటే వారికి మల్లి పథకాలను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
పథకం లబ్ధిదారుల సంక్షేమానికి భరోసా కల్పించేందుకు ఏపీలోని ప్రభుత్వం కీలక చర్యలను తీసుకుంటుంది. గతకాలంలో ప్రభుత్వం కొన్ని కారణాల చేత కొంతమందికి వైఎస్సార్ ఫించను కానుకను నిలిపివేసింది. అలా ఫించను నిలిపివేసిన వాటన్నిటిని మల్లి పరిశీలించాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒకవేళ ఈ పరిశీలనలో వారు అర్హులుగా తెలితే ఫించనును వారికి మల్లి అందించనున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి..
తెలంగాణ ప్రభుత్వం ఫీజులపై కీలక నిర్ణయం.. కేవలం 5% మాత్రమే లాభం తీసుకోవాలి
ఈ మేరకు గతంలో ఫించను అందుతూ నిలిపివేసిన వారి వివరాలు గ్రామ, వార్డు సచివాయల్లోని సంక్షేమ కార్యదర్శులకు అందించాలని వాలంటీర్లను ప్రభుత్వం ఆదేశించింది. అర్హత ఉన్నట్లయితే వారు రెండు-వార్షిక చెల్లింపుల్లో కొత్తగా మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వం జిల్లాలకు తెలియజేసింది. రాబోయే ఎన్నికలలోపు అర్హులైన పౌరులందరికీ ఈ పథకాలను అమలు చేయడమే సీఎం జగన్ లక్ష్యం అని తెలుస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 63 లక్షల మంది వ్యక్తులకు వైఎస్సార్ ఫించను కానుకను ప్రభుత్వం అందిస్తుంది. వారికి ప్రతినెల 1వ తేదికి రూ. 2,750 ఫింఛనుగా అందిస్తున్నారు. అయితే, వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ మొత్తాన్ని రూ.3000కు పెంచుతూ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి వారికి రూ. 10,000 పెన్షన్ మంజూరు చేస్తోంది.
ఇది కూడా చదవండి..
Share your comments