భారతదేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు అనేది తప్పనిసరి. ఈ ఆధార్ కార్డు లేనిదే మనకి ఈ పని జరగదు. మనం ఏ సంక్షేమ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకున్నా, దానికి ఆధార్ కార్డు కచ్చితంగా ఉండాలీ. కేంద్ర ప్రభుత్వం మనకు ఈ ఆధార్ కార్డులను యూఐడిఏఐ ద్వారా జారీ చేస్తుంది. అయితే పిల్లలకు ఆధార్ కార్డులపై యూఐడిఏఐ కీలక నిర్ణయాలను తెలిపింది. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
పిల్లలకు ఆధార్ కార్డులను జారీ చేయడానికి, దరఖాస్తు ఫారంలో పిల్లల యొక్క తల్లిదండ్రుల ఆధార్ నంబర్లు నమోదు చేయాలని ఆధార్ కార్డు జారిలా సంస్థ అయినా యూఐడిఏఐ తెలిపింది. ఆ ఫారంలో తల్లిదండ్రుల ఇద్దరి ఆధార్ నంబర్ల నమోదు మరియు తల్లిదండ్రుల ఇద్దరిలో ఎవరో ఒకరు వారి ఆధార్ బయోమెట్రిక్ తో ఆమోదం తెలపాల్సి ఉంటుంది అని యూఐడిఏఐ తెలిపింది. దీనికి సంబంధించి కీలక ఆదేశాలను కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ సఖ యూఐడిఏఐ డిప్యూటీ డైరెక్టర్ అయిన 'ప్రభాకరన్' జకారి చేసారు.
యూఐడిఏఐ వివిధ రకాల దరఖాస్తు ఫారంలను అందుబాటులోకి తీసుకువస్తుంది. మొత్తం మూడు రకాల దరఖాస్తు ఫారంల నమూనాలను యూఐడిఏఐ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే వారి వయస్సు ఆధారంగా ఈ దరఖాస్తు ఫారంలు ఉంటాయి. ఐదు ఎళ్ల లోపు వయస్సు ఉన్న పిల్లలకు ఆధార్ కార్డును తీసుకోవాలి అనుకుంటే వారి కొరకు ప్రత్యేక దరఖాస్తు ఫారంలో ధరఖాస్తు చేయవలసి ఉంటుంది.
ఇది కూడా చదవండి..
మీ ఫోన్లోనే డిజిటల్ ఓటర్ కార్డును డౌన్లోడ్ చేసుకోండిలా!
ఒకవేళ 5 నుండి 18 ఏళ్ల వయస్సు ఉన్నవారికి వేరే దరఖాస్తు ఫ్రమ్ ఉంటుంది అని యూఐడిఏఐ దాని యొక్క కొత్త నమూనా ఫారంను విడుదల చేసింది. 18 ఏళ్ళు పైబడిన వ్యక్తులకు వేరొక ఫారంలో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది అని యూఐడిఏఐ తెలిపింది. ఇక నుంచి 5 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలకు ఆధార్ కార్డును తీసుకోవాలన్న లేదు వాళ్ళ ఆధార్ కార్డులో మార్పులు చేయాలన్న కచ్చితంగా వారి తల్లిదండ్రుల యొక్క ఆధార్ నంబర్లు ఉండాలి.
ఈ మూడు రకాల దరఖాస్తు ఫారంలను అన్ని భాషలలోను అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నట్లు యూఐడిఏఐ తెలిపింది. కేవలం ఈ దరఖాస్తు ఫారంల ద్వారానే ఆధార్ కార్డులను పొందాలని యూఐడిఏఐ స్పష్టం చేసింది. ఈ నెల ఫిబ్రవరి 15 నుండి ఈ ఫ్రములను అందరికి అందుబాటులోకి రానున్నాయి అని యూఐడిఏఐ తెలిపింది.
ఇది కూడా చదవండి..
Share your comments