News

మీ ఫోన్లోనే డిజిటల్ ఓటర్ కార్డును డౌన్లోడ్ చేసుకోండిలా!

Gokavarapu siva
Gokavarapu siva

భారతదేశంలో 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు పొందే అవకాశం ఉంటుంది. ఈ ఓటర్ కార్డుకు దరఖాస్తు చేకున్న ప్రతి పౌరుడికి కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ గుర్తింపు కార్డులను అందిస్తుంది. మన ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఈ గుర్తింపు కార్డు చాల ముఖ్యం. పొరపాటున ఈ ఓటు కార్డు కనుక కనబడకపోతే పూర్వం ఓటు వేయడానికి కూడా ఉండేది కాదు. కేవలం ఓటు వేయడానికే మాత్రమే ఈ కార్డు పనికివస్తుంది అనుకుంటే పొరపాటు, అనేక సందర్భాలలో మనకు ఈ ఓటు కార్డు ఉపయోగపడుతుంది.

మనం వెళ్లే ప్రతి చోటుకు మనతో ఈ కార్డును తీసుకువెళ్లడం కష్టం. ఒక్కొక్కసారి పని మీదుగా వెళ్ళినప్పుడు, ఇంట్లోనే మరిచిపోతే, ఓటు కార్దు లేక వెళ్లిన పని కూడా ఆగిపోయే పరిస్థితులు ఎదురవుతాయి. ఇక నుండి ఇటువంటి సమస్యలను ఎదురుకోకుండా మనం మన ఫోన్లోనే ఈ డిజిటల్ ఓటర్ కార్డును డోములోడ్ చేసుకోవచ్చు. ఈ సౌకర్యాన్ని మనకి కేంద్ర ఎన్నికల సంఘం రెండేళ్ల క్రితమే కల్పించింది. ఆధార్ మరియు పాన్ కార్డు తరహా లోనే మనం ఈ ఓటర్ కార్డు యొక్కకూడా డిజిటల్ కాపీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆలా చేసుకుని మనకి ఎప్పుడు కావాలన్నా సులువుగా వాడుకోవచ్చు. అంతే కాదు ఈ డిజిటల్ ఓటర్ కార్డును వాడి ఎన్నికలలో ఓటు కూడా మనం వేయచ్చు.

ఈ డిజిటల్ ఓటర్ కార్డును పిడిఎఫ్ ఫైల్ రూపంలో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ కార్డును కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారిక పోర్టల్ నుంచి తేలికగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ కార్డును ప్రింట్ తీసుకుని వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం భారతదేశంలో ఈ సౌకర్యాన్ని వినియోగించుకునే అవకాశం 9. కోట్ల మందికి ఉండగా కేవలం ఒక శాతం ఓటర్లు మాత్రమే ఈ ఇ-ఓటర్ ఐడి కార్డు సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు.

ఇది కూడా చదవండి..

ఈ చిన్న పొరపాటుతో 80 వేల రేషన్‌కార్డులు రద్దు.. ఈ పొరపాట్లు మీరు చేయకండి !

మీ డిజిటల్ ఓటర్ కార్డును డౌన్లోడ్ చేసుకోండి ఇలా..

➢ముందుగా ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైటులోకి వెళ్ళాలి.
➢ముందుగానే ఈ వెబ్సైటులో రిజిస్టర్ చేసుకున్నట్లయితే, మీ వివరాలతో లాగిన్ అవ్వాలి. ఒకవేళ రిజిస్టర్ కాకపోతే కొత్త రిజిస్ట్రేషన్
చేసుకోవాలి.
➢వెబ్‌సైట్‌లో లాగిన్ అయిన తర్వాత హోమ్ పేజీలో e-epic Download ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
➢మీ ఓటర్ కార్డు నెంబర్ ను అందులో ఎంటర్ చేసి, రాష్ట్రం పేరు సెలెక్ట్ చేసి సెర్చ్ చేయాలి.
➢వివరాలు అన్ని పూర్తి చేసిన తర్వాత Send OTP పైన క్లిక్ చేయాలి.
➢ఆ ఓటర్ ఐడీ కార్డుకు లింక్ అయిన మీ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే మొబైల్ నెంబర్ వెరిఫై అవుతుంది.
➢ఆ తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి Download e-EPIC పైన క్లిక్ చేయాలి.
➢ఈ విధంగా చేస్తే చిటికెలో మీ స్మార్ట్ ఫోన్‌లోనే పీడీఎఫ్ ఫార్మాట్‌లో డిజిటల్ ఓటర్ ఐడీ కార్డ్ డౌన్‌లోడ్ అవుతుంది.

ఈ డిజిటల్ ఓటర్ కార్డును డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే గనుక, ముందుగా మీరు నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్ లో రిజిస్టర్ అయ్యి ఉండాలి. కొత్తగా నమోదు చేసుకున్న ఓటర్లు ఐతే, ఫామ్ 6 రిఫరెన్స్ నంబర్ తో డిజిటల్ ఓటర్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి..

ఈ చిన్న పొరపాటుతో 80 వేల రేషన్‌కార్డులు రద్దు.. ఈ పొరపాట్లు మీరు చేయకండి !

Related Topics

digital voter id

Share your comments

Subscribe Magazine