పర్యావరణ అనుకూల వ్యవసాయ సూత్రాలను సుస్థిర ప్రాతిపదికన రైతులు సహజ వ్యవసాయాన్ని చేసేలా ప్రోత్సహించడం జీవా యొక్క లక్ష్యం.
పర్యావరణ అనుకూల వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ (నాబార్డ్) బుధవారం" జీవ" ప్రోగ్రాం ను ప్రారంభించింది. ఇది 11రాష్ట్రాల్లో నాబార్డ్ ద్వారా కొనసాగుతున్న వాటర్ షెడ్ మరియు వాడి (గిరిజన అభివృద్ధి ప్రాజెక్టులు) కార్యక్రమాల ద్వారా సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ పథకం ప్రారంభానికి గుర్తుగా ఏర్పాటు చేసిన 'ఆన్ లైన్' కార్యక్రమంలో నాబార్డ్ చైర్మన్ జిఆర్ చింతల మాట్లాడుతూ, "జీవ వాటర్ షెడ్ కార్యక్రమం కింద భౌగోళికంగా నీటి లభ్యత తక్కువగా వున్నా 11 రాష్ట్రాలలో అమలు చేయనున్నారు .
పర్యావరణ అనుకూల వ్యవసాయ సూత్రాలను సుస్థిర ప్రాతిపదికన ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టేలా రైతులను ప్రోత్సహించడమే జీవా ప్రోగ్రాం యొక్క లక్ష్యమని ఆయన తెలిపారు . ఎందుకంటే ఈ ప్రాంతాల్లో వాణిజ్య వ్యవసాయం చేయలేరు కాబ్బట్టి , "ఈ కార్యక్రమం కింద హెక్టారుకు రూ.50,000 పెట్టుబడి పెడతాం. 11 రాష్ట్రాల్లోని 25 ప్రాజెక్టుల్లో పైలట్ ప్రాతిపదికన జివిఎ కార్యక్రమం అమలు చేయబడుతాయి .
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ వాతావరణ మార్పు పెను సవాలు అని, ఇప్పుడు దాని గురించి ఆలోచించడం సరికాదని అన్నారు. "దీనిని ఎదుర్కోవడానికి మనం చర్యలు తీసుకోవాలి. కార్బన్ ను తిరిగి మట్టిలో ఉంచడానికి మనం చర్యలుచేపట్టాలి . , “జివా” కోసం నాబార్డ్ జాతీయ మరియు బహుళపక్ష సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోనుంది. సాధారణ మట్టి నీటి పర్యవేక్షణ పద్ధతులపై ఆస్ట్రేలియాకు చెందిన కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (సిఎస్ఐఆర్ ఓ)తో, పరిశోధన సహాయం కోసం ,సహజ వ్యవసాయ కార్యకలాపాల శాస్త్రీయ ధృవీకరణ కోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసిఎఆర్)లు నాబార్డ్ కు సహకారం అందించనున్నట్లు చింతల చెప్పారు .
మరిన్ని చదవండి .
Share your comments