భారత దేశ ఆర్ధిక రాజధాని ముంబై ఆసియా కాండము బిల్లియనీర్ల మొదటి స్థానంలో ఉంది. చైనా రాజధాని బీజింగ్ ని అధిగమించి మొదటిస్థానంలో నిలవడం ఇదే మొదటి సారి. చైనా దేశంలోని బిల్లియనీర్ల సంఖ్యా మన దేశం కంటే ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ముంబై లోని బిల్లియనీర్ల సంఖ్యా బీజింగ్ నగరం కంటే ఎక్కువ ఉండటంతో ముంబైకి మొదటి స్థానం దక్కింది. బీజింగ్ లో ప్రస్తుతం కోటీశ్వరుల సంఖ్య, 91 గా నమోదు కాగా, ముంబైలో మొత్తం 92 మంది కోటీశ్వరులు ఉన్నారు. హురున్స్ రీసెర్చ్ నివేదిక ప్రకారం, 2024 ప్రపంచ కుబేర నగరాల్లో ముంబై మూడో స్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాల్లో న్యూయార్క్ 119 బిల్లియనీర్లు, లండన్ 97 బిల్లియనీర్లతో ఒకటి రెండు స్థానాల్లో నిలిచాయి.
ముంబైలోని బిల్లియనీర్ల సంపద గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 47% కి పెరిగి బిల్లియనీర్ల మొత్తం సంపద $445 బిలియన్ డాలర్లు గా ఉంది. మరోవైపు చైనా లోని ధనవంతుల జాబితా తగ్గి గత సంవత్సరం కన్నా ఈ ఏడాది 27% తక్కువ సంపదను నమోదు చేసుకుంది. ఇంకా ఎప్పటిలాగానే ఇండియాలో అమీరుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ 10 వ స్థానంలో నిలిచారు. ముకేశ్ అంబానీ, సంపద ఎనర్జీ మరియు ఫార్మాసిటికల్ రంగాల నుండి అధిక లాభాలు పొంది 116% పెరిగింది.
Read More:
మరోవైపు అదానీ ఇండస్ట్రీస్ అధినేత గౌతమ్ అదానీ అధిక లాభాల ద్వారా ప్రపంచ అమీరుల జాబితాలో క్రిందటి సంవత్సరం కంటే 8 స్థానాలు పెరిగి ప్రస్తుతం టాప్ 15 లిస్ట్ లో ఉన్నారు.హెచ్. సి. ఎల్ శివ నాడార్ కుటంబ సంపద ఘననీయంగా పెరిగి 34 వ స్థానంలో నిలిచారు. సీరం ఇండస్ట్రీస్ ఎస్. పూనావాలా, 82బిలియన్ డాలర్ల సంపదతో 55 వ స్థానం దక్కించుకున్నారు. అదే వరుసలో సన్ ఫార్మాసిటీకాల్స్ అధినేత దిలీప్ సంఘవి 61 వ స్థానం మరియు డి-మార్ట్ వ్యవస్థాపకుడు రాధాకిషన్ ధమని మరియు కుమార్ మంగళం బిర్లా 100 వ స్థానాల్లో నిలిచారు.
Read More:
Share your comments