News

అర్హులైన రైతులు అందరికీ రుణాలు మంజూరు చేయాలి -జిల్లా కలెక్టర్ గోపీ

Srikanth B
Srikanth B
అర్హులైన రైతులు అందరికీ రుణాలు మంజూరు చేయాలి -జిల్లా కలెక్టర్ గోపీ
అర్హులైన రైతులు అందరికీ రుణాలు మంజూరు చేయాలి -జిల్లా కలెక్టర్ గోపీ

మంగళవారం కలెక్టరేట్ కరీంనగర్ జిల్లా కలక్టరేట్ లో ప్రస్తుత ఆర్థిక సవత్సరంలో జూన్ త్రైమాసకం వరకు జరిగిన ప్రగతిపై బ్యాంకర్లతో డిసిసి మరియు డి ఎల్ ఆర్ సి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సoదర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జూన్ నెల వరకు రూ.3512.63 కోట్ల రుణాలను మంజూరు చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా వ్యవసాయం మరియు వ్యవసాయ అనుబంధ రంగాలకు గాను రూ. 1563.60 కోట్లు, ఎంఎస్ఎంఈ రంగంలో రూ. 914.31 కోట్లు, విద్యా రుణాలకు రూ.3.23 కోట్లు, హౌసింగ్ లోన్స్ రూ.79.44 కోట్లు, ఎస్.హెచ్ జి గ్రూప్ లకు రూ. 182 కోట్లు మరియు ఇతర రంగాలకు సంబంధించి రూ. 770.05 కోట్లు రుణాలను మంజూరు చేసినట్లు తెలిపారు. అర్హులైన రైతులు అందరికీ రుణాలు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.జిల్లా లోని రైతులు అందరు సకాలములో రుణాలు చెల్లించి మరల పునరుద్ధరణ చేసుకోవాలని, తద్వార తక్కువ వడ్డీ చెల్లించవచ్చని తెలియచేసారు.

సామాన్య ప్రజలకు ఊరట దిగొస్తున్న టమాటో ధర

ప్రసుత సంవత్సరంలో అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద రూ.94.98 కోట్లు రుణాలు అందిoచాలని ఆదేశించారు. నూతన పరిశ్రమలు స్థాపించడానికి అర్హులైన వారికి పిఎంఈజిపి, ఎంఎంఎఫ్ఎంఈ , పియంస్వానిధి కింద రుణాలు అందించాలని ఆదేశించారు. పరిశ్రమలకు సంబంధించిన రుణాలను చిన్న చిన్న కారణాలతో తిరస్కరించవద్దని బ్యాంకర్లకు సూచించారు.

జిల్లాలో ప్రధానమంత్రి జీవన జ్యోతి భీమా యోజన, సురక్ష భీమా యోజన పథకంతో పాటు ఏపివై పథకం అమలులో తక్కువగా ఉన్నందున పారిశ్రామిక కార్మికులను, స్వయం సహాయక సంఘాల సభ్యులు, అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగస్తులు మరియు కుటుంబ సభ్యులు మరియు అర్హులైన ప్రతి ఒక్కరినీ చేర్పించాలని అందుకు సంభందించిన జిల్లా అధికారులందరూ భాధ్యత తీసుకోవాలని ఆదేించారు. ఇచ్చిన లక్ష్యం సాధించినప్పుడే మనం విజయం సాధించినట్లవుతూందని అన్నారు. బ్యాంకర్లు మరియు జిల్లా అధికారులు అందరూ సమిష్టిగా కృషి చేసి జిల్లా అభివృద్ధి కోసం పని చేయాలన్నారు.

ఈ సమావేశంలో జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఆంజనేయులు, ఆర్బిఐ అధికారి డెబిజిత్ బరువా , ఏజిఎం నాబార్డ్ ప్రకాష్ , ఎస్బిఐ ఏజిఎం రవి శేఖర్ , యు బి ఐ ఏజిఎం కలీం , టీజీబీ ఏజిఎం లక్ష్మణ్ రావు, కెడీసీసీబీ సీఈఓ సత్యనారాయణ,అన్ని బ్యాంకుల కంట్రోలర్స్, కరీంనగర్ లోకల్ బ్రాంచ్ మేనేజర్స్ , పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ నవీన్ , పిడి మెప్మా బి రవీందర్, బీసీ డబ్ల్యూఓ రాజ మనోహర్, డి ఆర్ డి ఓ శ్రీలత, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ నరేందర్, వ్యవసాయ శాఖ ఏడి అంజలి, మొదలగు వారు పాల్గొన్నారు.

సామాన్య ప్రజలకు ఊరట దిగొస్తున్న టమాటో ధర

Related Topics

runamafie scheme

Share your comments

Subscribe Magazine

More on News

More