News

సామాన్య ప్రజలకు ఊరట దిగొస్తున్న టమాటో ధర

Srikanth B
Srikanth B
సామాన్య ప్రజలకు ఊరట దిగొస్తున్న టమాటో ధర
సామాన్య ప్రజలకు ఊరట దిగొస్తున్న టమాటో ధర

సామాన్య ప్రజలు టమోటా ధరలు ఎప్పుడు తగ్గుతాయా అని ఎదురుచూస్తున్నా క్రమంలో కాస్త ఊరట లభించనుంది నిన్నటి నుంచి వివిధ మార్కెట్లకు కొత్త పంట చేతికి రావడంతో టమాటో రాక్ మెర్కెట్లో పెరిగింది దీనితో టమాటో రకాన్ని బట్టి ధరలు మెల్లగా తగ్గుముఖం పడుతున్నాయి . దేశంలోని కొన్ని రాష్ట్రాలలో ఇప్పటికి టమాటో ధర దాదాపు రూ. రెండు వేలకు పైననే పలుకుతుంది దీనితో టమాటో కొనడానికి ఇబ్బంది పడుతున్న సామాన్యులకు త్వరలో టమాటో ధరలు తగ్గుతాయననే వార్త కాస్త ఊరట కల్గిస్తుంది.

 

అయితే గత మూడు రోజులుగా టమాటా ధరల్లో తగ్గుదల కనిపిస్తోంది. దిగుబడి పెరగడంతో టమాటా ధరలు దిగొస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌ రైతుబజారులో కిలో టమాటా రూ. 63లుగా ఉంది. బయట మార్కెట్లలో మాత్రం కిలో టమాటా రూ.120-140 పలుకుతోంది.

హైదరాబాద్‌ నగరానికి 10 రోజుల కిందట కేవలం 800 నుంచి 850 క్వింటాళ్ల టమాటా వచ్చేది. అయితే సోమవారం (ఆగస్టు 7) న మాత్రం 2450 క్వింటాళ్ల టమాటా హోల్‌సేల్‌ మార్కెట్‌కు వచ్చింది. అనంతపురం, చిత్తూరు, కర్ణాటక నుంచి హైదరాబాద్‌కు ఎక్కువగా దిగుబడి వస్తోంది. మరోవైపు రంగారెడ్డి, వికారాబాద్‌, చేవెళ్ల, మెదక్‌ జిల్లాల నుంచి కూడా మార్కెట్‌కు టమాటా వస్తోంది. దాంతో టమాటా ధర తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు.

ONDC లో ఆర్డర్‌ చేస్తే ₹70కే కిలో టమాటాలు..

టమాటా రాక పెరిగితే.. ధర మరింత తగ్గుతుందని వ్యాపారులు అంటున్నారు. ఆగష్టు చివరి వరకల్లా కిలో రూ. 40-50లోపు దొరికే అవకాశం ఉందని వ్యవసాయ మార్కెటింగ్‌ అధికారులు అంచనా వేస్తున్నారు.

ONDC లో ఆర్డర్‌ చేస్తే ₹70కే కిలో టమాటాలు..

Related Topics

black tomatoes

Share your comments

Subscribe Magazine