News

రూ.35 కోసం రైల్వేతో 5 సంవత్సరాల పాటు పోరాటం...చివరికి 3 లక్షల మందికి లబ్ది!

S Vinay
S Vinay

రాజస్థాన్‌లోని కోటాకు చెందిన 30 ఏళ్ల ఇంజనీర్ సుజీత్ స్వామి రైల్వే నుండి రూ.35 ను రికవరీ చేయడానికి ఐదేళ్ల పోరాటంలో విజయం సాధించారు.పూర్తి వివరాలు చదవండి.

అసలు విషయానికి వస్తే రాజస్తాన్ లోని కోటాకు చెందిన సుజీత్‌ స్వామి అనే ఇంజినీర్ 2017 వ సంవత్సరం ఏప్రిల్ మాసంలో కోటా నుంచి ఢిల్లీ వెళ్లేందుకు భారతీయ రైల్వే అనుబంధ సంస్థ అయిన ఐఆర్‌సీటీసీ ద్వారా టికెట్ బుక్ చేసుకున్నాడు దీనికి గాను అతను రూ. 765 చెల్లించారు. ఆ తర్వాత కొన్నిఅనివార్య కారణాల వల్ల సుజీత్ స్వామి తన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నాడు. అయితే ఐఆర్‌సీటీసీ కాన్సలేషన్ రుసుము రూ. 65 కాగా రూ.100 విధించి మిగతా మొత్తాన్ని ఐఆర్‌సీటీసీ రిఫండ్ చేసింది. అయితే 2017 జూలై 1 నుంచి జీఎస్టీ అమలు లోకి వచ్చింది దీనికి మునుపే సుజీత్‌ స్వామి టికెట్‌ క్యాన్సిల్‌ చేసుకొన్నారు. కానీ, ఐఆర్‌సీటీసీ జీఎస్టీ కింద రూ.35 ఎక్కువ విధించింది. తనకే కాగా తోటి ప్రయాణికులందరికి ఇలాగే జరిగింది.

జీఎస్టీ అమల్లోకి రాకముందే వసూలు చేసిన రూ.35ను తిరిగి పొందేందుకు తాను దాదాపు 50 సమాచార హక్కు దరఖాస్తులను దాఖలు చేశానని, నాలుగు ప్రభుత్వ శాఖలకు లేఖలు రాశానని సుజీత్‌ స్వామి చెప్పారు.పోగొట్టుకున్న డబ్బును తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ట్విట్టర్‌లో పదే పదే ట్వీట్ చేశాను, అందులో ప్రధానమంత్రి, రైల్వే మంత్రి, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, ఆర్థిక మంత్రి, జీఎస్టీ కౌన్సిల్‌ను ట్యాగ్ చేశాను. అయితే, మే 1, 2019న రూ. నాకు 33 వచ్చింది. మిగిలిన రూ.2 తిరిగి పొందేందుకు మూడేళ్లు కష్టపడ్డాను. చివరకు గత వారం శుక్రవారంమిగిలిన 2 రూపాయలు తన బ్యాంకు ఖాతాకి జమ అయిందని చెప్పుకొచ్చారు.తనకే కాకుండా మిగితా ప్రయాణికులందరికి డబ్బు రిఫండ్ అయింది.ఈ విజయాన్ని పురస్కరించుకుని సుజీత్ స్వామి 5 సంవత్సరాల పోరాటానికి గుర్తుగా రూ.35కి అదనంగా 500 కలిపి మొత్తం రూ.535 ప్రధానమంత్రి సంక్షేమ పథకానికి పంపారు.

మరిన్ని చదవండి.

ఐదు అంచెల పద్దతిలో సాగు విధానం!

Share your comments

Subscribe Magazine