తిరుపతిలో తన ఆటోలో చిన్న మొక్కలు, తీగలు పెంచుతూ గ్రీన్ ఆటోగా మార్చిన ఆటో డ్రైవర్ ,బాబు ఇంటర్నెట్‌లో ప్రస్తుతం ట్రెండింగ్. సాధారణ ఆటోని గ్రీన్ ఆటోగా మార్చడానికి వెనుక ఉన్న కథ ఏమిటి?
ఈరోజున ఎండల సంగతి మీకు తెలియని విషయం కాదు . బయటకు వెళ్తే ఎప్పుడెప్పుడు ఇంట్లోకి పోతామా అని ఎదురు చూసే పరిస్థితి ఇప్పుడు మనల్ని చుట్టుముడుతుంది. భారతదేశం ఈ రోజు అంతటా అగ్ని గుండంలా తయారయింది. కొన్ని ప్రదేశాలలో ఉష్ణోగ్రత పరిస్థితి ఇంకా ఎక్కువగ ఉంది. వైద్యులు, ప్రభుత్వాలు ఉష్ణోగ్రత ప్రభావం నుండి తమను తాము కాపాడుకోవటం కోసం ఎన్నో సలహాలను ఇస్తుంటే ,కొత్త రీతిలో అలోచించి తన ఆటో మొత్తాన్నే చల్లగా మారుస్తా అని అంటూ అందరి దృష్టి ని ఆకట్టుకున్నాడు తిరుపతి కి చెందిన బాబు.
జీవితం యొక్క ప్రారంభ దశలో చాలా కష్టమైన పరిస్థితులలో కేవలం కడుపు నింపుకోడం కోసం ఆటో పరిశ్రమలో మునిగిపోయాడు బాబు. ప్రకృతి మీద అపార ఇష్టంతో , బాబు తన ఆటోలో కొన్ని మొక్కలని పెంచారు. ఇది స్థానిక ప్రజల మధ్య మంచి ఆదరణ పొందడంతో , ఆటో ముందు భాగాన్ని మాత్రమే కాకుండా ఆటో వెనుక భాగం, పక్కలు అన్ని ప్రాంతాలను చిన్న మొక్కలు , తీగలతో నింపేసాడు.
ఇది కుడా చదవండి..
50 గ్రాముల బంగారం కోసం 22 ఏళ్ళు పోరాడాడు, మొత్తానికి సాధించాడు
తిరుపతి లోని ఎండలు తట్టుకోలేక మిగతా ఆటో వాళ్ళు చెట్ల కింద ఆగుతూ , నీడలో తిరుగుతూ ఉంటె బాబు ఆటో మాత్రం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నాన్ స్టాప్ గా ఊరంతా చక్కర్లు కొడుతూ ఉంటుంది.
ప్రజలు తమ ప్రయాణ సమయాలను పక్కన పెట్టి , బాబు యొక్క గ్రీన్ ఆటోలో ప్రయానించడానికి ఆసక్తి కలిగి ఉంటారు, బాబు యొక్క ఆటో ఎప్పుడూ ప్రయాణికులతో నిండి ఉంటుంది. అంతే కాకుండా బాబు , తన ఆటోలో ప్రయాణించే వ్యక్తులతో వాతావరణం గురించి, చెట్ల పెంపకం గురించి అవగాహన కల్పిస్తున్నారు.
వీరి గురించిన వివరాలు, సోషల్ వెబ్‌సైట్‌లలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి .బాబు యొక్క గ్రీన్ ఆటో ఆలోచనను ప్రపంచమంతా ప్రశంసిస్తుంది.
ఇది కుడా చదవండి..
Share your comments