News

గాడిద పాలతో నెలకి అక్షరాలా ₹6 లక్షల సంపాదన!

S Vinay
S Vinay

గంగిగోవు పాలు గరిటెడైనను చాలు... కడివెడైననేమి ఖరము పాలు అంటే "మంచి ఆవు పాలు కొన్ని ఉన్నా చాలు, గాడిద పాలు ఎన్ని ఉన్నా ఆవు పాలకు సమానం కావు" ఈ పద్యాన్ని వేమన ఏ భావంతో చెప్పిన కానీ ఇప్పుడు గాడిద పాలని చులకనగా చూడటానికి వీలు లేదు.

సరిగ్గా చదవకపోయినా , మంచి మార్కులు రాకపోయినా బడిలో విద్యార్థులను ఉపాధ్యాయులు తిట్టే వాటిలో " వెళ్లి గాడిదలు కాస్కో" అనే
తిట్టు తెలిసిందే కానీ ఇప్పుడు అదే గాడిదల కాపు లక్షల ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. పూర్తి వివరాలలోకి వెళ్తే తమిళనాడు కి చెందిన బాబు అనే ఒక గ్రాడ్యుయేట్ ఏకంగా 100 గాడిదలతో 17 ఎకరాల్లో డాంకీ ఫామ్ ని ఏర్పాటు చేశారు. ఆయన ఒక కాస్మెటిక్ ప్రొడక్ట్స్‌ తయారీ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని గాడిద పాలు సరఫరా చేస్తున్నారు. ఒక్కొక్క లీటర్ పాలు రూ. 7 వేల చొప్పున విక్రయిస్తున్నారు. తద్వారా నెలకు రూ.6 లక్షలకు పైగా ఆదాయం గడిస్తున్నారు.

వన్నార్‌పేట్‌కు చెందిన యు. బాబు, పాఠశాల మానేశాడు, తమిళనాడులో మొదటి గాడిద ఫారమ్‌ను ఇక్కడకు సమీపంలో స్థాపించాడు మరియు బెంగళూరుకు చెందిన అనేక రకాల కాస్మెటిక్ ఉత్పత్తులను తయారు చేస్తున్న ఒక సంస్థకు ₹7,000కు లీటరు గాడిద పాలను విక్రయించి యువ వ్యాపారవేత్త అయ్యాడు.బాబు కాస్మెటిక్ ఉత్పత్తుల కంపెనీ వారు ప్రతి నెలా 1,000 లీటర్ల గాడిద పాలను సరఫరా కొరకు వెతుకుతున్నారు, మరియు తమిళనాడులో కేవలం 2,000 కంటే తక్కువ గాడిదలు మాత్రమే ఉన్నాయని గ్రహించిన బాబు తన చదువుకు స్వస్తి చెప్పి, సొంతంగా 'గాడిద ఫారం' ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. తిరునెల్వేలి సమీపంలో గాడిద ఫారమ్‌ను ప్రారంభించాలనే తన ఆలోచనను అతను తన కుటుంబ సభ్యులకు వెల్లడించినప్పుడు అతనికి ఊహించినట్లే అందరు ఎగతాళిగా చూసారు, గాడిద పాలకు ఉన్న డిమాండ్ గురించి వివరించేందుకు ప్రయత్నించగా.. తన భార్యతో సహా ఎవరూ సిద్ధంగా లేరు. కానీ తన ప్రయత్నాన్ని కొనసాగించాడు.

తిరునెల్వేలిలోని ముక్కూడల్ గ్రామంలో ఈ ఏడాది మేనెలలో 100 గాడిదలతో డాంకీ ఫామ్ ప్రారంభించాడు. దీనికి డాంకీ ప్యాలస్ అని పేరు పెట్టాడు. ఈ ఫామ్‌లో తమిళనాడు రకం గాడిదలు , గుజరాత్ రకం హలారీ, మహారాష్ట్ర రకం కత్తియవాడి అనే మొత్తం మూడు జాతులు గాడిదలు ఉన్నాయి.అయితే ఇవి రోజుకి కేవలం 350 మి.లీ పాలను మాత్రమే ఇస్తాయి.

లీటర్ పాలు రూ. 7 వేల చొప్పున విక్రయిస్తున్నారు. ఆ విధంగా నెలకు రూ.6 లక్షలకు వరకు సంపాదిస్తున్నారు. అయితే అందులో మూడున్నర లక్షల వరకు గాడిదల మేతకు, కూలీలకు ఖర్చు అవ్వగా నెలకు రెండున్నర లక్షల నికర లాభం పొందుతున్నారు.

మరిన్ని చదవండి.

తేనె, నిమ్మరసం కలిపి తాగటం వలన కలిగే ప్రయోజనాలు ఎన్నో!

Share your comments

Subscribe Magazine