వినడానికి నమ్యశక్యంగా లేకున్నా ఇది నిజం. బ్రిటన్ కి చెందిన డగ్లస్ స్మిత్ ఒకే మొక్కకి 1269 టమాటాలు పండించి చరిత్ర సృష్టించాడు. ఇది ఇతనికి కొత్తేమి కాదు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా ప్రపంచం నిర్బంధంలో ఉన్నప్పుడు UK నివాసి అయిన డగ్లస్ స్మిత్ యొక్క అభిరుచి వ్యవసాయం పై మళ్లింది అయితే ఇతను వినూత్నమైన పద్ధతులపై దృష్టి సారించాడు. స్మిత్ 2021లో టమాటా మొక్కలను పెంచడం ప్రారంభించాడు దాని ఫలితంగా ఒకే మొక్కకి 839 టొమాటోలను ఉత్పత్తి చేసాడు ఐతే తాజాగా మళ్ళీ ఒకే మొక్కకి 1269 టమాటాలు పెంచి తన రికార్డుని తనే బద్దల కొట్టాడు.
ఐతే మార్చి 9 2022న, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారికంగా ఆమోదం తెలిపింది. సెప్టెంబరు 27, 2021న టొమాటో మొక్క పూర్తిగా పెరిగినప్పటికీ అధికారకంగా ధృవీకరణ ప్రక్రియ పూర్తి కావడానికి ఇంత సమయం పట్టింది. గతంలో వ్యవసాయానికి సంబంధించి సెప్టెంబరు 2020లో 3.1 కిలోల బరువున్న టొమాటోను పెంచి ప్రపంచంలోనే అత్యంత బరువైనదిగా రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా
డగ్లస్ స్మిత్ తన ఇంటి పెరట్లో 21 అడుగుల భారీ పొద్దుతిరుగుడు పువ్వును పెంచినప్పుడు వార్తల్లో నిలిచాడు.
గ్రీన్‌హౌస్‌లో ఈ టమోటా మొక్కను నాటినట్లు డగ్లస్ చెప్పారు. అతను చెప్పిన వివరాల ప్రకారం, టమోటాలు పెరగడానికి, అతను ప్రతి వారం మూడు నుండి నాలుగు గంటలు మొక్క పర్యవేక్షణలో గడిపాడు. దాని ఫలితమే నేడు ప్రపంచం మొత్తం ముందు ఉంది.డగ్లస్ స్మిత్ ఈ విషయాలను తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకున్నాడు. వృత్తి రీత్యా ఇతను ఒక ఐటి నిపుణుడు. ప్రస్తుతం ఈ వార్త ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఉద్యానవన ప్రేమికులను ఈ విషయం ఎంతోగాను ఆకర్షిస్తుంది.
మరిన్ని చదవండి
BIG UPDATE: ఇండియన్ నేవి లో 2500 ఖాళీల పోస్టులకి నియామకం ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు ఇంటర్ పాసైతే చాలు.
Share your comments