News

BIG UPDATE: ఇండియన్ నేవి లో 2500 ఖాళీల పోస్టులకి నియామకం ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు ఇంటర్ పాసైతే చాలు.

S Vinay
S Vinay

మన దేశ యువత ఇండియన్ ఆర్మీ లో విధులు నిర్వహించడానికి ఎంతో ఉత్సాహంతో వుంటారు అలాంటి వారందరికి కూడా గొప్ప శుభవార్త. దేశ భద్రతకి సంబందించిన త్రివిధ దళాలతో ఒకటైన నేవీ విభాగంలో AA (ఆర్టిఫైసర్ అప్రెంటిస్) మరియు SSR (సీనియర్ సెకండరీ రిక్రూట్) వంటి పోస్టులను భర్తీ చేసేందుకు నియామకాలను చేపట్టింది. దీనికి సంబందించిన అధికారక నోటిఫికేషన్ కూడా వచ్చింది. దీనికి సంబందించిన పూర్తి వివరాలు మీ కోసం.

పోస్ట్ పేరు : SSR (సీనియర్ సెకండరీ రిక్రూట్)
మొత్తం ఖాళీలు :2000.
విద్యార్హత:10+2 (ఇంటర్మీడియట్) పాసై ఉండాలి. గణితం లేదా భౌతిక శాస్త్రం మరియు కెమిస్ట్రీ / బయాలజీ / కంప్యూటర్ సైన్స్ లో ఏదైనా ఒక సబ్జెక్టుతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి
వయో పరిమితి: 01/08/2002 నుండి 31/07/2005 మధ్య జన్మించిన వారు మాత్రమే అర్హులు.

పోస్ట్ పేరు : AA (ఆర్టిఫైసర్ అప్రెంటిస్)
మొత్తం ఖాళీలు :500.
విద్యార్హత:10+2 (ఇంటర్మీడియట్) పాసై ఉండాలి. గణితం లేదా భౌతిక శాస్త్రం మరియు కెమిస్ట్రీ / బయాలజీ / కంప్యూటర్ సైన్స్ లో ఏదైనా ఒక సబ్జెక్టుతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి
వయో పరిమితి: 01/08/2002 నుండి 31/07/2005 మధ్య జన్మించిన వారు మాత్రమే అర్హులు.

దరఖాస్తు రుసుము: అభ్యర్థులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

ఆన్ లైన్ అప్లికేషన్ మొదలయ్యే తేదీ: 29 మార్చ్ 2022.

దరఖాస్తుకి చివరి తేదీ: 5 ఏప్రిల్ 2022.

ఎంపిక విధానం : రాత పరీక్ష మరియు ఫిసికల్ ఫిట్నెస్ (శారీరక సౌష్టవం ) ఆధారంగా జరుగుతుంది

ఇందులో ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్(PFT)లో అర్హత సాధించడం తప్పనిసరి. 1.6 కి.మీ పరుగును 7 నిమిషాలలో పూర్తి చేయాలి.20 స్క్వాట్‌లు మరియు 10 పుష్-అప్‌లు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎత్తు కనీసంగా 157 సెం.మీ ఉండాలి.

దరఖాస్తు చేయడం ఎలా:

ముందుగా ఇండియన్ నేవీ అధికారక వెబ్‌సైట్‌కి వెళ్లండి www.joinindiannavy.gov.in మీ ఇ-మెయిల్ ఐడితో రిజిస్టర్ చేసుకోండి. ఇప్పుడు, రిజిస్టర్డ్ ఇ-మెయిల్ ఐడితో ‘లాగ్-ఇన్’ చేసి, ప్రస్తుత అవకాశాలపై క్లిక్ చేయండి.వ్యక్తిగత వివరాలను జాగ్రత్తగా నమోదు చేసుకోండి తరువాత ముందుగానే స్కాన్ చేసుకున్న మార్క్ షీట్ మరియు ఇతర ధ్రువపత్రాలను అప్లోడ్ చేయండి. చివరగా అప్లికేషన్ ఫామ్ ని డౌన్లొడ్ చేసుకోండి.

మరిన్ని చదవండి.

ప్రభత్వ రంగ బ్యాంకు లో 105 స్పెసలిస్ట్ ఆఫీసర్ల ఖాళీలు, 89 వేలవరకు ఆకర్షణీయమైన జీతాన్ని పొందండి.మార్చ్ 24 దరఖాస్తుకి చివరి తేదీ

Share your comments

Subscribe Magazine