News

మేనేజ్ (MANAGE) దేశంలో వ్యవసాయ వాణిజ్య విప్లవానికి నాయకత్వం వహిస్తుంది-నరేంద్ర సింగ్ తోమర్

Srikanth B
Srikanth B


నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ (మేనేజ్), హైదరాబాద్ – వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ కు చెందిన స్వయంప్రతిపత్త సంస్థ. మేనేజ్ 6వ స్నాతకోత్సవ వేడుక 2022ను ఆగస్టు 26,2022 న హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లోని తన క్యాంపస్‌లో నిర్వహించింది.

ఈ స్నాతకోత్సవంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ (అగ్రి-బిజినెస్ మేనేజ్‌మెంట్) - PGDM (ABM)లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు డిగ్రీలు మరియు పతకాలను ప్రదానం చేసింది.

స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులైన కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ మరియు గౌరవ అతిథిగా కార్యదర్శి (A&FW) శ్రీ మనోజ్ అహుజా, ఐ ఎ ఎస్ పాల్గొన్నారు.

2018–22 విద్యా సంవత్సరాలకు చెందిన మూడు పి జి డి ఎం (PGDM) (ABM) బ్యాచ్‌ల నుండి 202 మంది విద్యార్థులు తమ డిప్లొమాలను పొందారు. పి జి డి ఎం (PGDM) (ABM) లకు చెందిన మూడు వరుస బ్యాచ్‌ల నుండి 9 మంది విద్యార్థులు బంగారు, వెండి మరియు కాంస్య పతకాలను అందుకున్నారు. అలాగే, తమ అగ్రి-వెంచర్ల ద్వారా వ్యవసాయానికి, రైతు లోకానికి అపారంగా సహకరిస్తున్న పి జి డి ఎం (PGDM) (ABM) కు చెందిన ముగ్గురు అసాధారణ ప్రతిభావంతులైన పూర్వ విద్యార్థులు ఈ సందర్భంగా అవార్డులను అందుకున్నారు. అదనంగా, పి జి డి ఎ ఈ ఎం (PGDAEM) నుండి 6 మంది విద్యార్థులు మరియు పి జి డి ఎ డబ్ల్యూ ఎం (PGDAWM) ప్రోగ్రామ్‌ల నుండి 3 విద్యార్థులు కూడా పతకాలు అందుకున్నారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయ కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి, శ్రీ నరేంద్ర సింగ్ తోమర్, ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, "రైతులోకానికి మీరందిస్తున్న సేవ మరియు వారి అభివృద్ధిలో మీ పాత్ర గురించి విద్యార్థులు గర్వపడాలి. ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్ అనేది చాలా అవసరం. మీ ఉద్యోగాలతో పాటు, మన దేశంలోని రైతుల శ్రేయస్సు కోసం వారికి సేవ చేయడానికి మీరు మీ సమయాన్ని వెచ్చించాలి."

మేనేజ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ పి. చంద్ర శేఖర ఈ సమావేశంలో ప్రసంగిస్తూ, "కొనసాగుతున్న వ్యవసాయ వాణిజ్య విద్య శిక్షణ తో పాటు పరిశోధనా సలహా, విధానపరమైన మద్దతు మరియు ఏ సీ & ఏ బి సి (AC&ABC), డి ఎ ఈ ఎస్ ఐ (DAESI), ఎస్ టి ఆర్ వై (STRY) మరియు ఆర్ ఏ ఎఫ్ టి ఏ ఏ ఆర్ (RAFTAAR) వంటి వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు లో పాల్గొనటం తో పాటు, మేము అనేక ఇతర కార్యకలాపాలను కూడా చేపడతాము. భారతదేశం వ్యవసాయంలో ప్రపంచ నేత బాటలో పయనిస్తోంది. సరిహద్దులు దాటి భారతీయ వ్యవసాయాన్ని విస్తరించడానికి మా విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ రాయబార కార్యాలయాలలో వ్యవసాయ రాయబారులు గా మారాలని మేము ఎదురుచూస్తున్నాము. భవిష్యత్తులో భారతదేశంలోని 200 కంటే ఎక్కువ సంస్థలలో వ్యవసాయ వ్యాపారం యొక్క నాణ్యత మరియు ప్రమాణాలను మెరుగుపరచడానికి మేనేజ్ కృషి చేస్తుంది.

శ్రీ మనోజ్ అహుజా, ఐ ఎ ఎస్, సెక్రటరీ ఏ & ఎఫ్ డబ్ల్యూ (A&FW), భారత ప్రభుత్వం, ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులను అందజేశారు.

స్నాతకోత్సవం 2022లో మేనేజ్ ఫ్యాకల్టీ, సిబ్బంది మరియు అవార్డులు మరియు పతకాలు అందుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు.

ఓటర్ ఐడీకి ఆధార్ కార్డును లింక్ చేయండి సులువుగా ..!

Share your comments

Subscribe Magazine